టెట్ అభ్యర్థులకు తెలంగాణ సర్కారు గుడ్‌న్యూస్
తెలంగాణ ప్రభుత్వం టెట్(TET) అభ్యర్థులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఇక నుంచి ఏడాదికి రెండు సార్లు పరీక్ష నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఆరు నెలలకు ఒకసారి అనగా జూన్, డిసెంబర్ నెలల్లో పరీక్ష నిర్వహించలాని ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.
ఒక అభ్యర్థి ఎన్నిసార్లైనా టెట్ రాసుకోవచ్చని ఉత్తర్వుల్లో వెల్లడించింది. అయితే టెట్‌లో ఉత్తీర్ణత సాధించిన వారికే డీఎస్సీ రాసుకునేందుకు అవకాశం కల్పించనున్నారు. టెట్ మార్కులను డీఎస్సీలో వెయిటేజీ ఇవ్వనున్నారు.

గతంలోనే నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్సీటీఈ) ఏటా రెండుసార్లు టెట్ నిర్వహించాలని రాష్ట్రాలను ఆదేశించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా టెట్ గడువును జీవితకాలానికి పెంచింది కేంద్ర ప్రభుత్వం. దీంతో ఒక్కసారి క్వాలిఫై అయితే, మరోసారి రాయాల్సిన అవసరం లేదు.
టెట్ మార్కులకు డీఎస్సీలో వెయిటేజీ ఉండటంతో కేవలం ఇప్పటికే టెట్ క్వాలిఫై అయిన అభ్యర్థులు తమ స్కోర్ పెంచుకునేందుకు మాత్రమే రాసుకోవచ్చు.
10 నుంచి అగ్రికల్చర్ డిప్లొమా కోర్సుల కౌన్సెలింగ్ ప్రొఫెసర్
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రవేశాలకు కౌన్సెలింగ్ తేదీలను యూనివర్సిటీ ప్రకటించింది. వర్సిటీ పరిధిలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో రెండేళ్ల వ్యవసాయ, సేంద్రియ వ్యవసాయ డిప్లొమో కోర్సులకు జులై 10, 11, 12వ తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్ రఘురామిరెడ్డి వెల్లడించారు.
మూడేళ్ల డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు కూడా ఇవే తేదీల్లో కౌన్సెలింగ్ ఉంటుందని తెలిపారు. రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్ చెప్పారు. కౌన్సిలింగ్ షెడ్యూల్, విద్యార్థులు తీసుకురావాల్సిన సర్టిఫికెట్లు, ఫీజు వివరాల కోసం www.pjtsau.edu.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు. అభ్యర్థులు షెడ్యూల్ ప్రకారం ర్యాంకుల వారీగా కౌన్సెలింగ్‌కు హాజరు కావాలన్నారు.












Click it and Unblock the Notifications