తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగాలు... అప్ల‌య్ చేసుకోండి...

తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల అయ్యింది. ఏఈఈ పోస్టుల భర్తీకి టీటీడి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటో తెలుసుకుందాం. నిరుద్యోగుల‌కు ఏపీ ప్ర‌భుత్వం మ‌రోసారి గుడ్‌న్యూస్ చెప్పింది. ఇప్ప‌టికే గ్రూప్ 1, గ్రూప్ 2నోటిఫికేష‌న్ల విడుద‌ల చేసిన ప్ర‌భుత్వం మ‌రో నోటిఫికేష‌న్‌తో నిరుద్యోగుల‌కు పండ‌గ వాతావ‌ర‌ణాన్ని క‌ల్పించింది. తిరుమల తిరుపతి దేవస్థానం మరో జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా ఏఈఈ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోగ‌ల‌ర‌ని టీటీడీ స్పష్టం చేసింది. పోస్టుల వివ‌రాలు, విద్యార్హ‌త‌లు చూద్దాం..

విద్యార్హతలు : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని హిందూ మతానికి చెందిన అభ్యర్థులు, ఈ ఉద్యోగాలకు అర్హులుగా టీటీడి నోటిఫికేషన్​లో పేర్కొంది. ఇక‌, ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారికి సంబంధించిన విద్యార్హతలను కూడా నోటిఫికేషన్​లో టీటీడీ స్పష్టం చేసింది. బీఈ, బీటెక్‌(ఎలక్ట్రానిక్స్​/ఎలక్ట్రికల్) ఉత్తీర్ణత సాధించిన అభ్య‌ర్థులను అర్హులుగా పేర్కొంది. దీంతోపాటు వయసు అర్హ‌త‌ను కూడా పొందుప‌రిచింది. ఈ ఉద్యోగాలకు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు, 2023 జులై1 నాటికి 42 ఏళ్లు మించకూడదని స్పష్టం చేసింది. ఎస్సీ/ ఎస్టీ/ బీసీ/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు 5 ఏళ్లు, పీహెచ్‌ అభ్యర్థులకు పదేళ్ల వయో సడలింపు ఉంటుంది.

Tirumala Tirupati Devasthanam Jobs, Apply fast

ఉద్యోగాల సంఖ్య‌ : తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసిన జాబ్ నోటిఫికేషన్​లో మొత్తం 4 పోస్టులు ఉన్నాయి. ఇందులో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఎలక్ట్రానిక్స్​/ఎలక్ట్రికల్​) పోస్టులకు టీటీడీ దరఖాస్తులను ఆహ్వానించ‌నుంది. అందులో OC-1, BC(A)-1, SC-1, EWS-1 పోస్టులు ఉన్నాయి.

ఎంపిక ప్రక్రియ : ఈ ఉద్యోగాలను వివిధ దశల్లో పూర్తి చేయ‌డం జరుగుతుంది. అభ్యర్థులకు ముందుగా రాత పరీక్షను రాయాల్సి ఉంటుంది. అందులో ఉత్తీర్ణత సాధించిన వారికి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఆ త‌ర్వాత స‌ర్టిఫికెట్స్ వెరిఫికేష‌న్‌, వైద్య పరీక్షల ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేయ‌డం జ‌రుగుతుంది.

జీత‌భ‌త్యాలు, ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు చివ‌రితేది : ఏఈఈ ఉద్యోగానికి ఎంపికైన అభ్య‌ర్థుల‌కు నెలకు రూ.57,100 నుంచి రూ.లక్షా 47వేల 760 వరకు ఉంటుంది. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు రిజిస్ట్రేషన్​ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ పోస్టులకు అప్లై చేసుకోవాల‌నుకునే అభ్యర్థులు ఆన్‌లైన్‌లో డిసెంబర్‌ 19, 2023లోపు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు ఫీజు వివ‌రాలు : OC అభ్యర్థులకు అప్లికేషన్​ ఫీజు రూ. 120, పరీక్ష ఫీజు రూ. 280. మొత్తం రూ.400 చెల్లించాల్సి ఉంటుంది.BC(A), SC, EWS అభ్యర్థులకు అప్ల‌య్ చేసుకునేందుకు ఎలాంటి ఫీజు ఉండ‌దు. కేవలం పరీక్ష ఫీజు మాత్ర‌మే ఉంటుంది. అది కూడా రూ. 280 మాత్రమే. పూర్తి వివరాలకు తెలుసుకోవాల‌నుకునే అభ్య‌ర్థులు వెబ్‌సైట్‌:https://ttd-recruitment.aptonline.in/ని సందర్శించి రిజిస్ట్రేషన్​ ప్రాసెస్​ కంప్లీట్​ చేసి ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+