నేడే సీటెట్ 2024 దరఖాస్తుకు చివరితేది.. త్వరగా అప్లయ్ చేసుకోండి.!
సీటెట్ జూలై సెషన్ 2024 దరఖాస్తు చేసుకునేందుకు నేడే ఆఖరుతేది. అప్లయ్ చేసుకోవాలనుకునే అభ్యర్థులు త్వరపడండి.. ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడాలనుకునేవారికోసం సిబిఎస్ఈ ప్రతీ సంవత్సరం సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CTET) నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్ష ఏడాదికి రెండుసార్లు జరుగుతుంది. ఈ సీటెట్ పరీక్షను పెన్ను పేపర్ విధానంలో ఉంటుంది. జులై-2024 ఏడాదికి సంబంధించిన సీటెట్ నోటిఫికేషన్ మార్చి నెలలో విడుదలైంది. ఈ పరీక్షకు సంబంధించిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మార్చి 7 నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇక, ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు ఏప్రిల్ 2 అంటే నేడే చివరితేదిగా నిర్ణయించడమైనది. అభ్యర్థులు ఇతర వివరాల కోసం https://ctet.nic.in/ ఈ వెబ్‌సైట్‌ను సంప్రదించొచ్చు.
ఈ పరీక్ష మొత్తం రెండు పేపర్లు ఉంటుంది. పేపర్ 1 ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి చదివే విద్యార్థులకు బోధించాలనుకునే వారికి కోసం. ఇక రెండో పేపర్ ఆరో తరగతి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు బోధించాలనుకునే వారి కోసం నిర్వహిస్తారు. ఈ పరీక్ష స్కోర్ జీవిత కాలం వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. ఇక, ఈ సీటెట్ పరీక్షను మొత్తం 20 భాషల్లో నిర్వహిస్తారు. దీనికి అప్లయ్ చేసుకోవాలనుకునేవారు ఆన్‌లైన్‌లో మాత్రమే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పరీక్ష స్కోర్‌ను కేంద్ర ప్రభుత్వం పరిధిలోని స్కూళ్లలో ఉపాధ్యాయ నియామకాల్లో పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.

విద్యార్హతలు : ఇంటర్, డిగ్రీ, డీఈఎల్‌ఈడీ/ డీఈడీ (ప్రత్యేక విద్య), బీఈడీ, బీఈడీ(ప్రత్యేక విద్య), బీఈఎల్‌ఈడీ/ బీఎస్సీఈడీ/ బీఏఈడీ/ బీఎస్సీఈడీ ఉత్తీర్ణులై ఉన్నవారు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు.
పరీక్ష ఫీజు వివరాలు : జనరల్/ ఓబీసీ అభ్యర్థులకు రూ.1000 (పేపర్ 1 లేదా 2 మాత్రమే) రెండు పేపర్లు రాయలనుకునేవారు రూ.1200 చెల్లించాలి. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు రూ.500 (పేపర్ 1 లేదా 2 మాత్రమే), రెండు పేపర్లు రాయాలనుకునేవారికి రూ.600 పరీక్ష ఫీజుగా చెల్లించారు.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: గుంటూరు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, వరంగల్ నగరాల్లో సీటెట్ పరీక్ష నిర్వహిస్తారు.












Click it and Unblock the Notifications