టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో మరో ముగ్గురి అరెస్ట్: సెంచరీ దిశగా అరెస్టులు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో అరెస్టుల పరంపర కొనసాగుతోంది. తాజాగా, బుధవారం ఈ కేసులో మరో ముగ్గురిని సిట్ అధికారులు అరెస్ట్​ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రవీణ్ బంధువులైన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వీరు ప్రవీణ్‌కి వారు సహకరించారని అధికారులు గుర్తించారు. దీంతో ఇప్పటి వరకూ అరెస్ట్​ అయిన వారి సంఖ్య 99కి చేరింది.

మరోవైపు, టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల​ లీకేజీ కేసులో ఏ-2గా ఉన్న రాజశేఖర్​ రెడ్డి వేసిన బెయిల్​ పిటిషన్​ నాంపల్లి కోర్టులో మరోసారి తిరస్కరణకు గురైంది. దీంతో ఆయన బెయిల్​ పిటిషన్​ మూడుసార్లు తిరస్కరణకు గురైనట్లు అయ్యింది. సిట్ అధికారులు నిందితుల నుంచి సేకరించిన సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌​లు,
హార్డ్‌డిస్క్‌లను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కు పంపించారు..

 TSPSC paper leakage case: three more arrested, total reaches 99.

ఆ నివేదిక రాగానే అనుబంధ అభియోగపత్రం దాఖలు చేస్తామని సిట్ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే 37మందితో సిట్ అధికారులు అభియోగపత్రం దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించిన నిందితులను జులైలో 10న 18 మందిని, 11వ తేదీన ముగ్గురిని, 12న మరో ఇద్దరిని సిట్​ అధికారులు అరెస్ట్ చేశారు.

కరీంనగర్‌​లో తండ్రి, కూతుర్లలను కూడా అధికారులు అరెస్ట్​ చేశారు. మద్దెల శ్రీనివాస్‌, ఆయన కుమార్తె సాహితి ఏఈ పరీక్ష పేపర్ కోసం రమేశ్​ కుమార్‌ సహాయం కోరాడు. రూ.30 లక్షలు ఒప్పందంతో మాస్​ కాపీయింగ్​ ద్వారా పరీక్షను రాయించాడు. ఈ వివరాలు వెలుగులోకి రావడంతో తండ్రి, కుమార్తెలను జులై 12న అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు.

కాగా, ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని, మరికొందరు నిందితుల అరెస్టు​లు పెరిగే అవకాశం ఉందని సిట్​ అధికారుల వెల్లడించారు. దాదాపు ఐదు నెలలుగా జరుగుతున్న ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో కనీసం 150 మంది వరకూ అరెస్టవుతారని అధికారులు అంచనావేస్తున్నారు.

చాలామంది అభ్యర్థులు రూ.లక్షలు వెచ్చించి కొనుగోలు చేశారని దర్యాప్తులో వెల్లడవుతోంది. ఓ అభ్యర్థి రూ.30 లక్షలు చెల్లించి ఏఈ ప్రశ్నపత్రాన్ని కొన్నాడని అధికారులు గుర్తించారు. ఏఈ ప్రశ్నపత్రం అమ్మడం ద్వారానే ఓ వ్యాపారి రూ.2.5 కోట్లు వరకు వసూలు చేశాడని అధికారులు తెలిపారు. ఇలా అనేక మంది పెద్ద మొత్తంలో నగదు చెల్లించి టీఎస్​పీఎస్సీ ప్రశ్నపత్రాలు కొనుగోలు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+