భారతీయ విద్యార్ధులకు బ్రిటన్ స్పెషల్ ఆఫర్-వలసలపై తనిఖీల వేళ..!
ఓవైపు అమెరికాలో భారతీయ విద్యార్ధులకు ట్రంప్ చుక్కలు చూపిస్తున్నారు. అక్రమంగా తమ దేశంలోకి వచ్చి పాగా వేసిన వలసల్ని తరిమేస్తున్నారు. అలాగే చదువుకునేందుకు వచ్చి నిబంధనల్ని ఉల్లంఘించి పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేస్తున్న వారిపైనా కొరడా ఝళిపిస్తన్నారు. ఇప్పుడు ట్రంప్ ను ఆదర్శంగా తీసుకుని బ్రిటన్ లో కైర్ స్టార్మర్ సర్కార్ కూడా భారతీయుల్ని టార్గెట్ చేస్తూ వారు పనిచేస్తున్న రెస్టారెంట్స్, మాల్స్ పై దాడులు చేస్తోంది. అయితే ఇంత సంక్షోభంలోనూ బ్రిటన్ సర్కార్ భారతీయ విద్యార్ధులకు గుడ్ న్యూస్ చెప్పింది.
యూకే-ఇండియా యంగ్ ప్రొఫెషనల్స్ స్కీమ్ 2025
బ్రిటన్ ప్రభుత్వం యూకే-ఇండియా యంగ్ ప్రొఫెషనల్స్ స్కీమ్ 2025 కింద విద్యార్దుల నుంచి ఉన్నత విద్యా కోర్సుల్లో అడ్మిషన్ల కోసం దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. ఈ పథకంలో భాగంగా భారతీయ విద్యార్ధులు రెండేళ్ల వరకు బ్రిటన్ లో నివసిస్తూ చదువుకోవడానికి, ప్రయాణించడానికి, పని చేయడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. పథకం కింద అందుబాటులో ఉన్న 3 వేల ప్రాంతాల్లో ఒకదానికి ఎంచుకోవడానికి అవకాశం ఇస్తారు. ఇందుకోసం 18-30 ఏళ్ల మధ్య వయస్సు గల భారతీయ పౌరులు తప్పనిసరిగా బ్రిటన్ ప్రభుత్వ వెబ్ సైట్ లో తమ పేర్లు నమోదు చేసుకోవాలి.

3 వేల మందికి ప్రయోజనం
యూకే-ఇండియా యంగ్ ప్రొఫెషనల్స్ స్కీమ్ 2025 లో భాగంగా మొత్తం 3 వేల మంది భారతీయ విద్యార్ధులకు ఇలా బ్రిటన్ కు వచ్చి చదువుకోవడానికి, నివసించడానికి, ప్రయాణించడానికి అనుమతిస్తారు. వీటి కింద దరఖాస్తు చేసుకునేందుకు బ్యాలెట్ ఫిబ్రవరి 18-ఫిబ్రవరి 20మధ్య ప్రతి రోజూ భారతీయ కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:30 గంటలకు తెరుస్తారు. ఇందులో నమోదు చేయడానికి దరఖాస్తుదారులు ఎలాంటి రుసుమూ చెల్లించాల్సిన అవసరం లేదు. దరఖాస్తుల్ని ర్యాండమ్ గా ఎంపిక చేస్తారు. యూత్ మొబిలిటీ స్కీమ్ వీసా కింద ఉన్నవారు మాత్రం ఈ పథకం కింద నమోదు చేసుకోవడం కుదరదు.
అర్హతలు ఇవే..
యూకే-ఇండియా యంగ్ ప్రొఫెషనల్స్ స్కీమ్ 2025 పథకంలో భాగంగా -దరఖాస్తుదారులు బ్రిటన్ కు వెళ్లాలని అనుకున్న తేదీకి కనీసం 18 ఏళ్లు ఉండాలి. అలాగే వారు బ్రిటన్ లో తమ ఖర్చుల కోసం 2,530 యూరోలు ఉన్నట్లు ఆధారాలు చూపించాలి. అంటే భారతీయ కరెన్సీలో రూ.2,70,824. అలాగే వారితో నివసించే లేదా వారి ఆర్థిక బాధ్యత వహించే 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు ఉండకూడదు. అలాగే తప్పనిసరిగా బ్రిటన్ బ్యాచిలర్స్ డిగ్రీ స్థాయి లేదా అంతకంటే ఎక్కువ అర్హత కలిగి ఉండాలి. దరఖాస్తుల బ్యాలెట్‌లోకి ప్రవేశించే ముందు దరఖాస్తుదారులు అన్ని అర్హతలు ఉన్నాయని నిర్ధారించుకోవాలి. అలాగే వారి బ్యాంకు ఖాతాలో కనీసం 30 రోజుల పాటు రూ.2,50,000 ఉండాలి.
వీసాల జారీ ఇలా..
బ్రిటన్ వెళ్లాలనుకునే భారతీయ పౌరుల కోసం బ్యాలెట్‌లో ప్రవేశం ఉచితమే. ఈ బ్యాలెట్ లో ఎంపికైన వారికి గడువు ముగిసిన రెండు వారాలలోపు ఇమెయిల్ ద్వారా తెలియజేస్తారు. అప్పుడు వీసా కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఆహ్వానిస్తారు. వారి బయోమెట్రిక్‌లను అందించడానికి, వీసా దరఖాస్తు రుసుము, ఇమ్మిగ్రేషన్ హెల్త్ సర్‌ఛార్జ్‌తో సహా అన్ని అనుబంధ రుసుములను చెల్లించడానికి ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్ ద్వారా యూకే హోమ్ ఆఫీస్‌కు దరఖాస్తు చేయడానికి బ్యాలెట్‌లో వారి వివరాలు ఇమెయిల్ తేదీ నుండి 90 రోజుల వరకూ అందుబాటులో ఉంటుంది. ఈ వీసా కోసం దరఖాస్తు చేసిన 31 రోజుల్లోని 28వ రోజు తప్పనిసరిగా కనీసం 28 రోజుల పాటు డబ్బు అందుబాటులో ఉంచుకోవాలి. ఎంపికైన దరఖాస్తుదారులు ఈ పథకం కింద బ్రిటన్ లో రెండేళ్లు పూర్తి చేసిన తర్వాత తప్పనిసరిగా భారత్ కు వెళ్లిపోవాలి. డిసెంబర్ 2023తో ముగిసిన సంవత్సరంలో భారతీయ పౌరులకు 2,100 పైగా వైపీఎస్ వీసాలు ఇచ్చారు.












Click it and Unblock the Notifications