యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్: 861 పోస్టులు, ఆప్లై చేయండిలా..అర్హత ఇదే
వివిధ సివిల్ సర్వీసు ఉద్యోగాల భర్తీకి యూపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. కేంద్ర క్యాడర్ పోస్టులకు ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. 861 పోస్టులను భర్తీ చేయనున్నారు. డిగ్రీ పాస్ అయి.. చివరీ ఏడాది చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
01.08.2022 వరకు 21 ఏళ్ల నుంచి 32 ఏళ్లు మించకుండా ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలి. 02.08.1990 నుంచి 01.08.2001 మధ్య జన్మించిన వారు అర్హులు.. అలాగే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఎన్నిసార్లయినా సరే ప్రయత్నించవచ్చు. ఓబీసీ అభ్యర్థులు 9 సార్లు ట్రై చేయవచ్చు. రాతపరీక్ష.. ప్రిలిమ్స్, మెయిన్స్.. ఇంటర్వ్యూ, పర్సనాలిటీ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

ప్రిలిమ్స్‌లో రెండు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్ 200 మార్కులు ఉంటాయి. అబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ ఛాయిస్ రూపంలో ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం రెండు గంటలు ఇచ్చారు. ప్రిలిమ్స్‌లో పేపర్-2 జనరల్ స్టడీస్ క్వాలిఫైయింగ్ పేపర్ ఉంటుంది. ఇందులో 33 శాతం అర్హత మార్కులు సాధించాల్సి ఉంటుంది. నెగటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులను మెయిన్స్ పరీక్షకు ఎంపిక చేస్తారు. మెయిన్స్ ఎగ్జామ్ 2025 మార్కులకు నిర్వహిస్తారు.
ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 02.02.2022 తేదీ నుంచి ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆప్లై చేసుకోవడానికి చివరి తేదీ 22.02.2022 సమయం ఇచ్చారు. ప్రిలిమ్స్ పరీక్ష 05.06.2022న నిర్వహిస్తారు. ఎస్సీ, ఎస్టీ, మహిళ, పీడబ్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు. ఇతరులు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది.
-
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!!












Click it and Unblock the Notifications