శ్రీలీలపై నితిన్ సంచలన వ్యాఖ్యలు

నితిన్‌ - శ్రీలీల జంటగా నటించిన వినోదాత్మక చిత్రం 'ఎక్స్‌ట్రా ఆర్డినరీమ్యాన్‌'. ఈ చిత్రానికి వక్కంతం వంశీ దర్శకుడు. డిసెంబర్‌ 8న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు. ''ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌' తనకు చాలా ప్రత్యేకమైన సినిమా అని నితిన్ అన్నారు. తన కెరీర్‌లో ఇంత మంచి పాత్ర ఇప్పటి వరకు చేయలేదని, నాన్న సుధాకర్ రెడ్డి డిస్ట్రిబ్యూటర్‌గా చేసిన మొదటి సినిమా రాజశేఖర్‌ నటించిన 'మగాడు'అని తెలిపారు.

అది సూపర్‌ హిట్‌ కావడంతో ఇండస్ట్రీలోనే కొనసాగారని, తనకు కూడా సినిమాల్లోకి రావాలనే ఆసక్తి కలిగిందన్నారు. ఈరోజు తాను ఇలా ఉండటానికి కారణం రాజశేఖర్ అని, ఆయన ఈ సినిమా చేయడమే తమకు పెద్ద బహుమతి అన్నారు.

actor nithin comments on heroine sreeleela

శ్రీలీల నిజ జీవితంలో కూడా ఎక్స్‌ట్రార్డినరీ మహిళ అని, ఆమెకు భరతనాట్యం, కూచిపూడి తెలుసని, రాష్ట్రస్థాయిలో హాకీ ప్లేయర్‌ అని, స్విమ్మింగ్‌లోనూ రికార్డు ఉందన్నారు. త్వరలోనే మెడిసిన్‌ పూర్తిచేస్తుందంటూ విషెస్ తెలిపారు. సినిమా గురించి ఒక్కమాటలో చెప్పాలంటే డిసెంబర్‌ 8వ తేదీన తన అభిమానులంతా కాలరు ఎగరేసేలా ఉంటుందన్నారు. .

సినిమా బాగా రావడం కోసం నిర్మాత ఎక్కడా రాజీ పడలేదని, రాజశేఖర్‌ ఇందులో నటించాలని బలంగా కోరుకున్నానని, ఆయన కథ విన్న వెంటనే అంగీకరించారని, అది తన అదృష్టం అని దర్శకుడు వక్కంతం వంశీ అన్నారు. శ్రీలీల మాట్లాడుతూ.. ఇప్పటి వరకు విడుదలైన ట్రైలర్‌, పాటలను ఆదరించారని, ఈ సినిమాలో తన పాత్రకు హద్దులు ఉండవన్నారు. ఈ సినిమాను కచ్చితంగా అందరూ ఎంజాయ్‌ చేస్తారన్నారు.

నితిన్‌ చాలా కష్టపడతాడని, ఈ సినిమాలో తనది చిన్న పాత్రే అయినా.. నవ్వులు పూయిస్తుందని రాజశేఖర్ అన్నారు. 'జీవితమూ జీవిత ఒక్కటే' అని తాను చెప్పిన డైలాగ్ వైరల్‌గా మారిందన్నారు. అందరూ తాను జీవిత ఏం చెబితే అది చేస్తానని అనుకుంటారని, కానీ అది నిజం కాదని, తాను ఏది చెబితే జీవిత అది చేస్తుందని, చాలా మంచి వ్యక్తి అని కొనియాడారు. మంచి మంచి అతిథి పాత్రలుంటే నటించడానికి రాజశేఖర్ సిద్ధమని జీవిత అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+