మెగా కాంపౌండ్‌లో గొడవలు..?!
Allu Arjun: ఏపీలో మరో కీలక ఘట్టం ముగిసింది. ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడ గన్నవరం సమీపంలోని కేసరాపల్లి ఐటీ పార్క్ వద్ద ఏర్పాటైన ఈ కార్యక్రమంలో గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్.. ఆయనతో ప్రమాణం చేయించారు.
తొలుత చంద్రబాబు.. అనంతరం పవన్ కల్యాణ్, నారా లోకేష్, కింజరాపు అచ్చెన్నాయుడు.. ఇలా వరుసగా 24 మంత్రులు ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకారం ముగిసిన అనంతరం పవన్ కల్యాణ్, మెగాస్టార్ చిరంజీవిలతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభకు అభివాదం చేయడం హైలైట్‌గా నిలిచింది.

ఈ కార్యక్రమానికి మెగాస్టార్ కుటుంబం మొత్తం హాజరైంది. చిరంజీవి ఏకంగా రాష్ట్ర ప్రభుత్వ అతిథిగా ఇందులో పాల్గొన్నారు. సురేఖ, రామ్ చరణ్, శ్రీజ, నాగబాబు, నీహారిక, సాయి ధరమ్ తేజ్.. ఇలా అందుబాటులో ఉన్న మెగా కాంపౌండ్ కుటుంబ సభ్యులు, నటులు.. ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నారు.
అల్లు అరవింద్ ఫ్యామిలీ దీనికి దూరంగా ఉంది. ఆయన కుటుంబం నుంచి ఎవరూ దీనికి హాజరు కాలేదు. అల్లు అర్జున్‌ను ఇప్పటికే మెగా కాపౌండ్ దూరం పెట్టిన విషయం తెలిసిందే. గతంలో తనవాళ్లు, పరాయివాళ్లు అంటూ నాగబాబు వేసిన ట్వీట్.. వారి మధ్య దూరాన్ని పెంచింది. ఈ ట్వీట్‌ను ఆయన డిలేట్ చేశారు గానీ ఆ అగాథం తగ్గలేదు.
తాజాగా మరో కీలక పరిణామం మెగా కాంపౌండ్‌లో సంభవించింది. అల్లు అర్జున్‌ను..అటు సాయి ధరమ్ తేజ్ కూడా దూరం పెట్టినట్లు తెలుస్తోంది. స్టైలిష్ స్టార్‌కు చెందిన సోషల్ మీడియా అకౌంట్స్ ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ (ట్విట్టర్)ను సాయి ధరమ్ తాజాగా అన్ ఫాలో కొట్టాడు. పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారం చేసిన వేళ.. ఈ పరిణామం చోటు చేసుకోవడం చర్చనీయాంశమౌతోంది.
మొన్నటి ఎన్నికల్లో అల్లు అర్జున్.. ఒక వైపు- మిగిలిన మెగా కుటుంబం అంతా మరోవైపు నిలిచాయి. తనకు అత్యంత ఆప్తుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నంద్యాల అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసిన శిల్పా రవిచంద్రారెడ్డి కోసం అల్లు అర్జున్ రంగంలోకి దిగారు. మిత్రుడి కోసం నంద్యాలకు వచ్చి మరీ ప్రచారం చేశారు. పిఠాపురం నుంచి స్వయానా తన మేనమామ పవన్ కల్యాణ్ ఎన్నికల బరిలో నిలిచినప్పటికీ- ఆయన కోసం అల్లు అర్జున్ ప్రచారానికి వెళ్లలేదు.












Click it and Unblock the Notifications