ఓ ఇంటివారైన నరేష్ - పవిత్రా లోకేష్?
ఒకప్పుడు మంచి కామెడీ హీరోగా ప్రేక్షకులను అలరించి నరేష్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారారు. పాత్ర ఏదైనా పరకాయ ప్రవేశం చేసే నరేష్ ఆ పాత్రను బాగా రక్తి కట్టిస్తుంటారు. దాదాపుగా దర్శకులంతా నరేష్ ను ఏదోఒక క్యారెక్టర్ లో తమ సినిమాల్లో నటింపచేసేందుకు మొగ్గుచూపుతుంటారు. నరేష్ గురించి చెప్పుకునేటప్పుడు మనకు మరో పేరు కూడా గుర్తుకు వస్తుంది. ఆ పేరు ఏదో కాదు.. పవిత్రా లోకేష్. దక్షిణ భారతదేశంలో కరోనా తర్వాత అత్యంత ప్రజారణ పొందిన పదం ఏదైనా ఉందా అంటే.. అది నరేష్-పవిత్రా లోకేష్ జంట అని చెప్పొచ్చు.
వీరి ప్రేమ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటకలో కూడా సంచలనం సృష్టించింది. అటువంటి నరేష్ ప్రస్తుతానికి ఓ ఇంటివారయ్యారు. చిలుకూరు బాలాజీ ఆలయానికి సమీపంలో ఆయనకు ఓ వ్యవసాయ క్షేత్రం ఉంది. ఇటీవలే ఇందులో అత్యాధునిక హంగులతో కొత్త ఇంటిని నిర్మించి గృహప్రవేశం చేశారు. గృహప్రవేశానికి ఆహ్వానం అందుకున్న మురళీమోహన్, గోపీచంద్, అశోక్ కుమార్ తదితరులు వచ్చివెళ్లారు. ఈ ఇంటికి నరేష్ విజయకృష్ణ మందిరం అనే పేరు పెట్టారు. ఇందిరాదేవి స్ఫూర్తివనం ఏర్పాటు చేసి అక్కడే కృష్ణ-విజయనిర్మల విగ్రహాలను కూడా అదేరోజు ప్రారంభించారు.

రమ్య రఘుపతి నుంచి విడాకులు రాకపోవడంతో ప్రస్తుతం నరేష్ పవిత్రా లోకేష్ తో సహజీవనం చేస్తున్నారు. బాలాజీ ఆలయం వద్ద కొత్తగా నిర్మించిన ఇంటిలో వీరిద్దరూ నివసించే అవకాశం ఉంది. గృహప్రవేశం సందర్భంగా పవిత్రా లోకేష్ దగ్గరుండి మరీ అతిథులను ఆహ్వానించారు. రమ్యరఘుపతితో విడాకుల వ్యవహారం ఒక కొలిక్కి వచ్చిన తర్వాత పవిత్రా లోకేష్ ను వివాహం చేసుకోనున్నారు. తమ బంధం గురించి కృష్ణకు ముందే చెప్పామని, అలాగే మహేష్ బాబుకు కూడా తెలుసని, తమ బంధానికి వారంతా అంగీకరించారని నరేష్ ఓ సందర్భంలో తెలిపారు.












Click it and Unblock the Notifications