ఇక ఆ దేశం నుంచే భారత్ కు 67 శాతం LPG..! కేంద్రం సంచలన ప్రకటన..!

ఇరాన్ వార్ తర్వాత అంతర్జాతీయంగా లెక్కలు మారిపోతున్నాయి. ముఖ్యంగా హార్ముజ్ జలసంధి మీదుగా మనకు ఎల్పీజీ (LPG) నౌకలు ఆలస్యం అవుతుండటం, అటు అమెరికాతో పెరుగుతున్న వాణిజ్య బంధం వంటి కారణాలతో కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా గతంలో ఎన్నడూ లేనంత స్ధాయిలో అమెరికా నుంచి ఏకంగా 67 శాతం ఎల్బీజీ దిగుమతి చేసుకోబోతున్నట్లు కేంద్రం ఇవాళ సంచలన ప్రకటన చేసింది.

ఎల్పీజీ వంటగ్యాస్ పై కేంద్రం అద్దిరిపోయే ఆఫర్: ఇకపై. !!
ఎల్పీజీ వంటగ్యాస్ పై కేంద్రం అద్దిరిపోయే ఆఫర్: ఇకపై. !!

గత కొన్ని నెలలుగా చోటు చేసుకుంటున్న పరిణామాల ఫలితంగా అమెరికా (US) మన దేశానికి అతిపెద్ద ఎల్బీజీ సరఫరాదారుగా అవతరించిందని కేంద్రం పేర్కొంది. మన ఎల్పీజీ అవసరాలలో కొంత మాత్రమే అమెరికా నుండి తీసుకోవాలని భారత్ మొదట్లో అనుకుందని, అయితే ఇప్పుడు దాన్ని భారీగా పెంచినట్లు కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ వెల్లడించారు. దేశం యొక్క ఎల్పీజీ అవసరాలలో సుమారు 10 శాతం అమెరికా నుండి దిగుమతి చేసుకోవాలని ప్రభుత్వం ఈ ఏడాది ప్రారంభంలో నిర్ణయించిందని, అయితే ఇరాన్ వార్, హార్ముజ్ జలసంధి వ్యవహారాలతో దీనికి సంబంధం లేదన్నారు.

US Emerges as Dominant LPG Supplier to India with 67 Share Hardeep Singh Puri
డీలిమిటేషన్ బిల్లుపై రాహుల్ మద్దతు కోరిన కేంద్రం..! 2 కండిషన్లు..!
డీలిమిటేషన్ బిల్లుపై రాహుల్ మద్దతు కోరిన కేంద్రం..! 2 కండిషన్లు..!

కానీ ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల ఫలితంగా.. ఇవాళ మన ఎల్పీజీ దిగుమతులలో అమెరికా వాటా సుమారు 67 శాతానికి పెరిగినట్లు చెప్పడానికి సంతోషిస్తున్నట్లు హర్దీప్ పూరీ తెలిపారు. చమురు, ఎల్పీజీని వివిధ దేశాల నుంచి కొనుగోలు చేస్తున్నప్పటికీ, తాజా పరిస్ధితుల్లో అమెరికా ఎల్పీజీ వాటా మాత్రం 67 శాతానికి చేరిందన్నారు. మన గ్యాస్ సరఫరాదారులను వైవిధ్యపరచడం అనేది ఇంధన భద్రతను బలోపేతం చేయడానికి, ఒకే ప్రాంతంపై అధికంగా ఆధారపడటం వల్ల కలిగే ప్రమాదాలను తగ్గించడానికి ఓ మార్గంగా కేంద్రం భావిస్తోంది. అందుకే రిస్క్ లేని అమెరికా వైపు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+