పల్లవి ప్రశాంత్ అరెస్ట్ పై సినీనటుడు శివాజీ ఫస్ట్ రియాక్షన్!!
బిగ్ బాస్ సీజన్ సెవెన్ విజేత పల్లవి ప్రశాంత్ ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కేసులో అరెస్ట్ అయిన అతనికి 14 రోజుల రిమాండ్ కూడా విధించి ఆయనను చంచల్ గూడా జైలుకు తరలించారు. బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో కామన్ మ్యాన్ గా అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ అసాధారణమైన ఆటతో టైటిల్ విన్నర్ గా నిలిచాడు.
అయితే బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఫైనల్స్ అనంతరం జూబ్లీహిల్స్ అన్నపూర్ణ స్టూడియో దగ్గర పల్లవి ప్రశాంత్ అభిమానులకు, రన్నరప్ గా నిలిచిన అమర్ దీప్ అభిమానులకు మధ్య గొడవ జరిగింది. ఈ గొడవల్లో పలువురు కంటెస్టెంట్ ల కార్ల అద్దాలు ధ్వంసం చేయడమే కాకుండా, రోడ్డుపైకి వచ్చి ఆర్టీసీ బస్సుల అద్దాలు కూడా ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదుచేసి పల్లవి ప్రశాంత్ ను అరెస్ట్ చేశారు.

ఇక తాజాగా ఈ ఘటనపై స్పందించిన సినీ నటుడు శివాజీ పల్లవి ప్రశాంత్ చాలా మంచి వాడని, అతడు ఇటువంటి పనులు చేయడని అభిప్రాయం వ్యక్తం చేశారు. తాను బిగ్ బాస్ హౌస్ లో నాలుగు నెలలు ఉండి ప్రశాంత్ ను దగ్గరగా చూశానని పేర్కొన్నారు. గెలిచానని ఆనందం ఒక్కోసారి మనిషిని డామినేట్ చేస్తుందని, అలాంటి పరిస్థితులలో ఎగ్జైట్ అయ్యి ర్యాలీలో పాల్గొన్నాడన్నారు.
బయట జరిగిన గొడవ గురించి కానీ , తాను స్టూడియో నుండి బయటకు రావడానికి ముందే కొంతమంది కంటెస్టెంట్ ల కార్ల అద్దాలు పగలగొట్టిన విషయం గానీ పల్లవి ప్రశాంత్ కు తెలియదని శివాజీ అభిప్రాయం వ్యక్తం చేశారు. చట్టాన్ని గౌరవించి త్వరలోనే బయటకు వస్తారని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. చట్టాన్ని అతిక్రమించాడనే నెపం మోపబడ్డ వ్యక్తి పల్లవి ప్రశాంత్ నిర్దోషి అని శివాజీ పేర్కొన్నాడు.
ఇటువంటి దాడులు తప్పని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎవరైనా అభిమానులు కావచ్చు, అభిమానుల రూపంలో ఉన్న కొంతమంది దాడులకు పాల్పడిన వారు కావచ్చు చేసింది తప్పని, దీంతో ప్రశాంత్ కు ఎటువంటి సంబంధం లేదని సినీ నటుడు శివాజీ పేర్కొన్నారు. ప్రశాంత్ అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి కచ్చితంగా బయటకు వస్తాడని శివాజీ తెలిపారు.












Click it and Unblock the Notifications