డబ్బుల కోసం ఫ్లాట్ అమ్మేసిన సోనూసూద్!
సోనూసూద్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అభినవ దానకర్ణుడు అని చెప్పొచ్చు. కరోనా సమయంలో ప్రభుత్వాలు కూడా చేయలేని ఎన్నో పనులను తానొక్కడే, తన బృందంతో కలిసి, తన సొంత డబ్బులతో చేశాడు. కార్మికులపట్ల ఎంతో ఉదారంగా వ్యవహరించారు. ముంబయిలోని తన హోటల్ ను కరోనా బాధితులకు కేటాయించారు. ఏమాత్రం లాభాపేక్ష లేకుండా ఆక్సిజన్ సిలిండర్లను ఆసుపత్రులకు అందజేయడంతోపాటు కార్మికులను స్వస్థలాలకు పంపించేందుకు ఎన్నో రైళ్లు మాట్లాడి వారిని క్షేమంగా వారి ఊళ్లకు పంపించాడు.
వాస్తవానికి సోనూసూద్ అటువంటి పనులు చేస్తుంటే అధికారంలో ఉన్న ప్రభుత్వాలే అసూయపడ్డాయి. అతను మనసుపెట్టి చేశాడు.. ప్రభుత్వాధినేతలు మాత్రం మనసు లేకుండా చేశారు. అంతే తేడా. ముంబయిలో నివాసం ఉండే సోనూసూద్ కు తెలుగులో భారీగా అభిమానులున్నారు. ఇటీవలే అనారోగ్యంతో మృతిచెందిన ఫిష్ వెంకట్ కుటుంబానికి ఇల్లు కట్టిస్తానని హామీ ఇచ్చాడు. గతంలో తాను నిర్వహించిన అనేక సేవా కార్యక్రమాలకు ఎన్నో విలువైన ఆస్తులను అమ్మేశారు. సినిమాల్లో నటించడంద్వారా వచ్చిన డబ్బుతో వాటిని కొన్నాడు.

తాజాగా సోనూసూద్ మరో లగ్జరీ ఫ్లాట్ ను అమ్మేశారు. ముంబయిలోని లోఖండ్ వాలా మినర్వా ప్రాంతంలో ఆ ఫ్లాట్ ఉంది. రూ.5.16 కోట్లకు 2012లో మహాలక్ష్మీ అపార్ట్ మెంట్ లో ఫ్లాట్ ను కొనుగోలు చేశాడు. ప్రస్తుతం దీని ధర రూ.8.10 కోట్లకు చేరుకుంది. తాను సంపాదించే సొమ్మును ఎక్కువగా రియల్ ఎస్టేట్ లోనే పెట్టుబడి పెడతాడు. ముంబయిలోని చాలా ప్రాంతాల్లో, అతి ఖరీదైన ప్రాంతాల్లో కూడా సోనూ సూద్ కు ఫ్లాట్లు, స్థలాలు ఉన్నాయి. తెలుగులో ప్రస్తుతం అడపా దడపా సినిమాలు చేస్తూ వస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడం, మళయాళం, హిందీ భాషల్లో సినిమాలు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications