ప్రెగ్నెంట్ అయ్యాకే పెళ్లి చేసుకున్న.. నా భర్తకు ఆ విషయం తెలియదంటున్న నటి

ప్రముఖ నటి అమలా పాల్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. 2009లో రిలీజ్ అయిన మలయాళ చిత్రం నీలతామర సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. ఆ తర్వాత తనదైన శైలిలో నటిస్తూ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలానే తెలుగులో సైతం పలువురు హీరోలతో నటించిన ఈ ముద్దుగుమ్మ ఇద్దరమ్మాయిలతో, నాయక్‌, బెజవాడ సినిమాలతో మంచి ఫాలోయింగ్ తెచ్చుకుంది. తెలుగులో ఆమెకు విశేష ప్రేక్షక ఆదరణ లభించింది. ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలూ దక్కాయి. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ చిత్రాల్లో నటించి పాన్ ఇండియా లెవెల్లో అభిమానులను సొంతం చేసుకుంది.

అమలా పాల్ 2014లో తమిళ దర్శకుడు విజయ్ ను వివాహం చేసుకుంది, కానీ 2017లో విడాకులు తీసుకుంది. 2023లో అమలా జగత్ దేశాయ్ ని వివాహం చేసుకుంది. 2024 జూన్ 11న వీరికి ఇలాయ్ అనే మగబిడ్డ జన్మించాడు. కొంతకాలంగా సినిమాలకు బ్రేక్‌ ఇచ్చిన ఆమె ఈ మధ్యే నిర్మాతగా, నటిగా రీఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేసింది.

actress-amala-paul-shocking-comments-on-her-marriage-and-pregnancy

తన భర్తకు తాను నటి అని తెలియదని వెల్లడించింది. జగత్‌ దేశాయ్‌ది గుజరాత్‌ అని.. కానీ గోవాలో సెటిలైయ్యారని తెలిపింది. ఇద్దరికి గోవాలో పరిచయం అయ్యిందని.. అతడు దక్షిణాది సినిమాలు చూడడు కాబట్టి నటిని అనే విషయం తెలియదు చెప్పుకొచ్చింది. తాను కూడా ఆ విషయాన్ని తనకు చెప్పలేదని.. తమ స్నేహం ప్రేమగా మారి.. కొన్నాళ్ల తర్వాత ప్రెగ్నెంట్‌ అయిన తర్వాత పెళ్లి చేసుకున్నామనీ స్పష్టం చేసింది.

ఇక ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు తన సినిమాలని ఒక్కొక్కటిగా జగత్‌కు చూపించానని వివరించింది. తన సినిమాలు బాగా నచ్చాయని.. అవార్డ్స్‌ తీసుకున్న వీడియోలు చూసి కూడా బాగా హ్యాప్పీగా ఫీల్ అయ్యారని తెలిపింది. ఇక మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ మళ్లీ సినిమాల్లో ఫుల్ బిజీ అవ్వాలని ఆమె ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+