చైనాలో ఎంబీబీఎస్.. బొద్దింకలు, తేళ్ళు తిన్నా అంటున్న ప్రముఖ నటి

ప్రముఖ నటి కామాక్షి భాస్కర్ల తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. 2022లో ప్రియురాలు అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైనప్పటికీ ఆ చిత్రంతో ఆశించిన స్థాయిలో గుర్తింపు దక్కించుకోలేదు. ఆ తర్వాత మా ఊరి పొలిమేర, మా ఊరి పోలిమేర2 సినిమాలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు పొందింది. అలానే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, ఓం భీమ్ బుష్ సహా పలు సినిమాలతో ప్రేక్షకులకు మరింత చేరువైంది. అలాగే ఝాన్సీ, సైతాన్, ధూత వంటి సూపర్ హిట్ తెలుగు వెబ్ సిరీసుల్లోనూ కీలక పాత్రలు పోషించింది ఈ ముద్దుగుమ్మ.

అయితే 1995లో హైదరాబాద్‌లో జన్మించిన కామాక్షి.. హైదరాబాద్ లోనే చదువుకుంది. ఆ తర్వాత చైనాకు వెళ్లిపోయి అక్కడే ఎంబీబీఎస్ చదువు పూర్తి చేసినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత చైనాలోని ఒక ఆసుపత్రిలో ఇంటర్న్ డాక్టర్‌గా పని చేసిమ ఈమె.. ఆపై ఇండియాకు తిరిగొచ్చి అపోలో ఆస్పత్రిలో ఆరేళ్ల పాటు సేవలందించింది. ఈ క్రమంలోనే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. చైనాలో చదువుకునే రోజుల్లో ఎదుర్కొన్న కష్టాల గురించి ఓపెన్ అయ్యింది.

actress kamakshi bhaskarla opens about MBBS in China and eating cockroaches

తాను ఉండే చోట ఇంగ్లీష్ మాట్లాడే వారు తక్కువగా ఉండటంతో భాష సమస్యల వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నానని కామాక్షి తెలిపారు. మాండరీన్ భాష నేర్చుకోవడం తప్పనిసరి అయ్యిందని.. వంట చేసుకోవాల్సి వచ్చిందని చెప్పారు. చైనీస్ ఆహారపు అలవాట్లకు అలవాటు పడేందుకు ప్రయత్నించానని తెలిపారు. వాళ్ళు బొద్దింకలు, తేళ్లు తింటారని.. అందుకే తాను కూడా వాటిని రుచి చూసినట్లు వెల్లడించారు.

అయితే చిన్నప్పటి నుంచి నటి కావాలనే కోరికతో మొదట మోడలింగ్ రంగం వైపు వెళ్ళినట్టు ఆమె తెలిపారు. మిస్ తెలంగాణ పోటీల్లో విజేతగా నిలిచానని.. ఆ తర్వాత మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని ఫైనల్స్ వరకు చేరుకున్నట్టు వివరించారు. అంతేకాకుండా.. తన కుటుంబంలో సినీ నేపధ్యం ఉన్నప్పటికీ, ఎవరి సహాయం తీసుకోకుండా ఎదిగానని చెప్పుకొచ్చింది.

తన లక్ష్యం దర్శకురాలు అవ్వడమే అని స్పష్టం చేసింది. ప్రస్తుతం కామాక్షి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. మొత్తానికి డాక్టర్ అవ్వాల్సింది యాక్టర్ అయ్యాను అనే డైలాగ్ ని ఈమె నిజయం చేసిందని ఫ్యాన్స్ కుషీ అవుతున్నారు. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగాఉంటోంది ఈ అందాల తార.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+