వైరల్ వీడియో.. రెండు కళ్లు చాలవు.. మీనాక్షీ చౌదరి అందాలు అదరహో !
మీనాక్షి చౌదరి.. 'ఇచట వాహనములు నిలుపరాదు' సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సరసన నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. రవితేజతో నటించిన ఖిలాడీ సినిమా అంచనాలు అందుకోలేకపోయినా.. అడివి శేష్‌తో చేసిన హిట్ 2 మాత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత మహేష్ బాబు సరసన గుంటూరు కారంలో నటించి ప్రేక్షకులను అలరించింది. గతేడాది చివర్లో వచ్చిన లక్కీ భాస్కర్ కూడా విజయవంతం కాగా.. ఈ ఏడాది సంక్రాంతికి మరో హిట్‌ని అందుకుంది. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్న ఈ భామ టాలీవుడ్‌లో ఫుల్ జోష్‌లో కొనసాగుతోంది.
సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా "మీనాక్షి"..
దుబాయ్‌లో జరిగిన సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA)లో మీనాక్షి చౌదరి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. స్టైలిష్ వైట్ డిజైనర్ డ్రెస్‌తో రెడ్ కార్పెట్‌పై మెరిసి అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం ఆమె వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 'లక్కీ భాస్కర్'లో అద్భుతమైన నటనకు గాను మీనాక్షి ఉత్తమ నటి (క్రిటిక్స్) అవార్డును అందుకుంది.

రిలేషన్ రూమర్స్..
ఇదిలా ఉండగా, మీనాక్షి చౌదరి వ్యక్తిగత జీవితంపై కూడా ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. ఆమె అక్కినేని హీరో సుశాంత్‌తో రిలేషన్‌లో ఉన్నారని వార్తలు గుప్పుమంటున్నాయి. ఇద్దరూ కలిసి నటించిన ఇచట వాహనములు నిలుపరాదు సినిమా సమయంలో పరిచయం ప్రేమగా మారిందని టాక్. ఇటీవల వీరిద్దరూ కలిసి ఎయిర్‌పోర్ట్‌లో కనిపించడంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరింది. అయితే ఈ రూమర్లపై ఇప్పటివరకు వీరిద్దరూ ఎలాంటి స్పందన ఇవ్వలేదు.
రాబోయే ప్రాజెక్టులు..
ప్రస్తుతం మీనాక్షి చౌదరి, నాగచైతన్య సరసన NC-24లో నటిస్తోంది. 'విరూపాక్ష' ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఒక మిథికల్ యాక్షన్ థ్రిల్లర్. ఇందులో నాగచైతన్య కొత్తగా, ఇంతవరకు చూడని రోల్‌లో కనిపించనుండగా, మీనాక్షి హీరోయిన్‌గా స్క్రీన్‌పై మెరుస్తుంది. ఇప్పటికే వీరి కాంబినేషన్ సన్నివేశాల షూటింగ్ ప్రారంభమైనట్లు సమాచారం.
అవార్డులు సొంతం చేసుకున్న విజేతలు..
ఉత్తమ చిత్రం - కల్కి
ఉత్తమ దర్శకుడు - సుకుమార్
ఉత్తమ దర్శకుడు (క్రిటిక్స్) - ప్రశాంత్ వర్మ
ఉత్తమ నటుడు - అల్లు అర్జున్
ఉత్తమ నటుడు (క్రిటిక్స్) - తేజ సజ్జా
ఉత్తమ నటి - రష్మిక మందన్నా
ఉత్తమ సహాయ నటుడు - అమితాబ్ బచ్చన్
ఉత్తమ సహాయ నటి - అన్నే బెన్
ఉత్తమ సంగీత దర్శకుడు - దేవి శ్రీ ప్రసాద్ (డీఎస్పీ)
ఉత్తమ గీతరచయిత - రామ్ జోగయ్య శాస్త్రి
ఉత్తమ గాయకుడు - శంకర్ బాబు కందుకూరి
ఉత్తమ గాయని - శిల్పా రావు
ఉత్తమ ప్రతినాయకుడు - కమల్ హాసన్
ఉత్తమ పరిచయ నటులు - పంకూరి, భాగ్యశ్రీ బోర్సే (నటీమణులు), సందీప్ సరోజ్ (నటుడు)
ఉత్తమ పరిచయ దర్శకుడు - నంద కిషోర్ యేమని
ఉత్తమ కొత్త నిర్మాత - నిహారిక కొణిదెల
ఉత్తమ సినిమాటోగ్రాఫర్ - రత్నవేలు
ఉత్తమ హాస్యనటుడు - సత్య
-
సమంత, రాజ్ నిడిమోరు క్యూట్ వీడియో వైరల్..! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
స్టార్ బ్యూటీతో కలిసి సైలెంట్‌గా ఓటీటీ డెబ్యూ ఇస్తున్న యంగ్ హీరో !! -
దురంధర్-2కు బిగ్ షాక్.. ఆన్లైన్లో ప్రత్యక్షమైన ప్రింట్! -
తెలంగాణ గద్దర్ అవార్డుకు ఎంపికైన తొలి బయోపిక్ ఇదే.. స్పెషాలిటీ అదే !! -
ధురంధర్2, ఉస్తాద్ భగత్ సింగ్.. వీటిల్లో ఏ సినిమాకు వెళ్లాలి? -
మెగా హీరో భార్యకు ఏమైంది?.. ఆ సీన్ చూస్తే దయ్యం పట్టినట్లే ఉంది! వీడియో -
త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్న తెలుగు హీరోయిన్.. వైజాగ్‌లో సందడి !! -
సొంత సినిమాను వదిలేసి పరాయి సినిమాకు భజనా? -
ఉస్తాద్‌కు బిగ్ షాక్...తొలి రోజే ఆన్లైన్లో HD ప్రింట్ ప్రత్యక్షం! -
అనుష్క పెళ్లి ట్విస్ట్: ఆ విషయాన్ని ఎందుకు హైలైట్ చేస్తున్నారు? -
‘ధురంధర్2’లో హైలైట్స్ ఇవే.. దద్ధరిల్లుతున్న థియేటర్లు











Click it and Unblock the Notifications