మరోసారి ప్రేమలో పడ్డ రేణు దేశాయ్..ఎవరితో అంటే..?
పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గతంతో పోలిస్తే ఇటీవల కాలంలో తెలుగు మీడియాలో ఎక్కువుగా కనిపిస్తున్నారు. గతంలో హైదరాబాద్‌కు వచ్చినప్పుడు మాత్రమే కనిపించే రేణు దేశాయ్ ఇప్పుడు తరచూ కనిపిస్తూ సందడి చేస్తున్నారు. పవన్ కల్యాణ్‌తో విడిపోయిన తరువాత రేణు దేశాయ్ తన ఇద్దరి పిల్లలతో పుణేలో సెటిల్ అయ్యారు. ఇండస్ట్రీకి దూరం అయినప్పటికీ సోషల్ మీడియా ద్వారా తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూనే ఉంది.
రేణు దేశాయ్ చాలాకాలం తరువాత తెలుగు సినిమాలో నటించింది. రేణు దేశాయ్ ఇటీవల తన సెకండ్ ఇన్నింగ్స్‌ను స్టార్ట్ చేసింది. రవితేజ హీరోగా తాజాగా నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమాలో రేణు దేశాయ్ ఓ ముఖ్య పాత్రలో నటించింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బొల్తా కొట్టింది. ఇదిలా ఉంటే తాజాగా రేణు దేశాయ్ తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు.

లేటేస్ట్ సూపర్ హిట్ మూవీ యానిమల్ మూవీపై ఆమె కామెంట్ చేశారు. రణ్‌బీర్ కపూర్ హీరోగా , సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన యానిమల్ మూవీ డిసెంబర్ 1న విడుదలైంది. మొదటి షో నుంచే ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. తాజాగా ఈ సినిమా చూసినట్టు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా రేణు దేశాయ్ తెలిజేయజేశారు.
ఎట్టకేలకు యానిమల్ సినిమా చూశానని..ఎటువంటి అనుమానం లేకుండానే..ఈ సినిమాతో ప్రేమలో పడ్డానని రేణు దేశాయ్ పోస్ట్ చేశారు. అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలతో పాటు, తండ్రి , కొడుకుల మధ్య ప్రేమను కూడా తెర మీద బాగా చూపించారని..మీరు కూడా ఇదే అనుభూతిని పొందాలంటే..కచ్చింతంగా థియోటర్‌లో చూడటం మిస్ అవ్వకండి అంటూ ఓ పోస్ట్‌ను షేర్ చేసింది.












Click it and Unblock the Notifications