ఉత్తరాంధ్ర యాస నేర్చుకుంటున్న నటి సాయిపల్లవి...
నేచురల్ బ్యూటీగా ప్రేక్షకుల మనసు దోచుకున్న నటి సాయిపల్లవి.. ఒక్క చిత్రంతోనే అందం, నటన, డ్యాన్స్‌తో తెలుగు అభిమానుల హృదయాల్లో తన దైన స్థానం సంపాదించుకుంది ఈ అమ్మడు. తెలుగులో ఫిదా సినిమాతో అడుగుపెట్టింది సాయిపల్లవి. ఈ సినిమాలో ఆమె నటన, డ్యాన్స్ మాత్రమే కాకుండా తన వాయిస్‌తో కూడా ప్రేక్షకులను మెప్పించింది. పాత్ర నచ్చితేనే ఆ సినిమా ఒప్పకుంటుంది ఈ అమ్మడు. ఆ పాత్ర కోసం ఎంత కష్టమైన పడుతుంది. అందుకు ఉదహారణ ఫిదా చిత్రమే. ఈ సినిమాలో సొంతంగా తనే డబ్బింగ్ చెప్పుకోవడమే కాకుండా తెలంగాణ యాస కూడా నేర్చుకుంది. ఈ చిత్రంలోని భాను పాత్ర కోసం ఏకంగా ట్రాక్టర్ కూడా నేర్చుకుంది. ఇప్పడు మరో కొత్త ప్రయత్నం చేయబోతుంది సాయిపల్లవి.
ఫిదా సినిమాలోని భాను డైలాగ్స్ ఇప్పటికీ అందరికీ గుర్తుంటాయి. అచ్చ తెలంగాణ యాసలో మాట్లాడి అందరినీ ఆకట్టుకుంది. తమిళనాడులో పుట్టిన ఈ నటి తెలుగు ఎంతో స్పష్టంగా మాట్లాడుతోంది. ఇప్పడు ఓ సినిమాలోని పాత్ర కోసం ఈ అమ్మడు ఉత్తరాంధ్ర యాస నేర్చుకునే పనిలో ఉంది. నాగచైతన్య సరసన తండేల్ సినిమాలో నటిస్తోంది ఈ అమ్మడు. ఈ సినిమాలోని పాత్ర కోసం ఇప్పడు సాయిపల్లవి ఏకంగా సిక్కోలు భాష నేర్చుకునేందుకు సిద్ధమవుతుంది. ఇందుకోసం ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా తీసుకుందట. ఈ సినిమాకు చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. సాయిపల్లవికి ఉత్తరాంధ్ర యాస నేర్పించేందుకు ప్రత్యేకంగా ఒక నిపుణుడిని కూడా ఏర్పాటు చేశారంట! సినిమాకోసం ఇలాంటి ప్రయోగాలు చేయడం కేవలం సాయిపల్లవికే సాధ్యం అవుతుందని ఆమె అభిమానులు అంటున్నారు. తెలంగాణలో యాసలో అదరగొట్టిన అమ్మడు సిక్కోలు భాషలో ప్రేక్షకులను ఎలా మెప్పించిందో చూడాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే..!

సీత పాత్రలో సాయిపల్లవి...
సాయిపల్లవి చేతిలో పలు ప్రాజెక్టులు ఉన్నాయి. నాగచైతన్య చిత్రంతో పాటు సీత పాత్రలో బాలీవుడ్‌లో మెరవనుంది ఈ అమ్మడు. వీటితో పాటు తమిళంలో కూడా మరికొన్ని చిత్రాల్లో నటిస్తోంది. హిందీ రామాయణంలోని సీతపాత్రకు సాయిపల్లవి ఒకే చెప్పినట్లు కూడా వార్తలు వచ్చేస్తున్నాయి. ఈ సినిమా కూడా త్వరలోనే సెట్స్‌పైకి రాబోతుందట! ఇక, సీత పాత్రలో సాయిపల్లవిని చూసేందుకు అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.












Click it and Unblock the Notifications