అర్ధనగ్న వీడియో వైరల్.. అసలు నిజం బయటపెట్టిన హీరోయిన్!

టాలీవుడ్‌లో 'అర్జున్ రెడ్డి' చిత్రంతో ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొంది.. అనంతరం బాలీవుడ్‌లో వరుస అవకాశాలు అందుకుంటున్న నటి శాలిని పాండే ఇటీవల ఓ తీవ్ర సైబర్ వివాదంలో చిక్కుకున్నారు. సోషల్ మీడియాలో ఆమె టాప్‌లెస్‌‌గా ఉన్నట్లు చూపిస్తూ ఓ వీడియో విపరీతంగా వైరల్ కావడంతో అది నెటిజన్లలో చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంపై ఇప్పటివరకు మౌనంగా ఉన్న శాలిని పాండే ఎట్టకేలకు స్పందిస్తూ.. ఆ వీడియో పూర్తిగా నకిలీదని.. ఏఐ ద్వారా సృష్టించిన డీప్‌ఫేక్ కంటెంట్ అని శాలిని పాండే స్పష్టం చేశారు.

వీవీ వినాయక్ ఒక్క మాటతో పెరిగిన అంచనాలు.. 'ధర్మస్థల నియోజకవర్గం’పై ఫుల్ బజ్!
వీవీ వినాయక్ ఒక్క మాటతో పెరిగిన అంచనాలు.. 'ధర్మస్థల నియోజకవర్గం’పై ఫుల్ బజ్!

టెక్నాలజీ దుర్వినియోగంపై శాలిని పాండే ఆవేదన
తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అధికారిక ప్రకటన విడుదల చేస్తూ శాలిని పాండే తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. "ప్రస్తుతం ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్న వీడియోతో నాకు ఎలాంటి సంబంధం లేదు. అది పూర్తిగా కల్పితం. మహిళలను లక్ష్యంగా చేసుకుని వారి ప్రతిష్టకు భంగం కలిగించడానికి ఏఐ టెక్నాలజీని ఇలా ఉపయోగించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది" అని శాలిని పాండే పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇలాంటి దుశ్చర్యలకు వినియోగించడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించకూడదని ఆమె గట్టిగా స్పష్టం చేశారు.

Actress Shalini Pandey Reacts To Fake Viral Deepfake Video She Urges fans to Report and not Share it

వీడియోను రిపోర్ట్ చేయాలని అభిమానులకు విజ్ఞప్తి
ఈ సందర్భంగా సోషల్ మీడియా వినియోగదారులకు, అభిమానులకు శాలిని పాండే ఓ విజ్ఞప్తి చేశారు. ఆ ఫేక్ వీడియో మీ దృష్టికి వస్తే దానిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులకు షేర్ చేయవద్దని, డౌన్‌లోడ్ చేయవద్దని, దానిపై ఎలాంటి కామెంట్స్ చేయవద్దని కోరారు. దానికి బదులుగా వెంటనే సంబంధిత ప్లాట్‌ఫామ్‌లలో ఆ వీడియోను రిపోర్ట్ చేయాలని సూచించారు. సమాజంలో ఇలాంటి డిజిటల్ వికృత కంటెంట్ వ్యాప్తి చెందకుండా అరికట్టడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా, వివేకంతో వ్యవహరించాలని ఆమె కోరారు.

'మీర్జాపూర్: ది మూవీ’కి బిగ్ షాక్.. ఆ సీన్లు కట్, రన్ టైమ్ ఎంతో తెలుసా?
'మీర్జాపూర్: ది మూవీ’కి బిగ్ షాక్.. ఆ సీన్లు కట్, రన్ టైమ్ ఎంతో తెలుసా?

పెరుగుతున్న డీప్‌ఫేక్ ముప్పు
ఇటీవల కాలంలో సినీ ప్రముఖులు, ముఖ్యంగా మహిళా నటీమణులు ఈ డీప్‌ఫేక్, మార్ఫింగ్ టెక్నాలజీకి బాధితులుగా మారుతుండటం పరిపాటిగా మారింది. ఓ వ్యక్తి అసలు పాల్గొనని దృశ్యాలలో ఉన్నట్లుగా ఏఐ ద్వారా మార్చి సృష్టించే ఈ టెక్నాలజీ వల్ల తీవ్రమైన ప్రైవసీ సమస్యలు ఏర్పడుతున్నాయి. 2017లో అర్జున్ రెడ్డితో తెరంగేట్రం చేసిన శాలిని పాండే, ఆ తర్వాత రణవీర్ సింగ్ సరసన 'జయేష్ భాయ్ జోర్దార్', 'మహారాజ్', 'రాహుకేతు' వంటి సినిమాల్లో నటించి గుర్తింపు పొందారు. ప్రస్తుతం ఈ డీప్‌ఫేక్ సంస్కృతిపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ సినీ వర్గాల్లో మళ్లీ బలంగా వినిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+