నువ్వు దేవతవి తల్లి..భర్తకే భరణం చెల్లించిన హీరోయిన్

ఇటీవల కాలంలో విడాకులు తీసుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. అందులోనూ సెలబ్రిటీల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎప్పుడు ఏ సెలబ్రిటీలు విడాకలు గురించి ప్రకటిస్తారో తెలియని పరిస్థితి. సినిమా షూటింగ్ సమయంలో ప్రేమించి పెళ్లి చేసుకోవడం , ఆ తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకోలేక , కలిసి ఉండలేక విడాకుల బాట పడుతున్నారు.

చాలామంది సెలబ్రిటీల జీవితాలు ఇలాగే ఉన్నాయి. భాషతో సంబంధం లేకుండా సెలబ్రిటీలు చాలామంది విడాకులు తీసుకుంటున్నారు. సాధారణంగా విడాకుల సమయంలో భర్తల నుంచి కోట్ల రూపాయిల భరణం డిమాండ్ చేస్తుంటారు భార్యలు. అయితే విచిత్రంగా భర్తకే భరణం చెల్లించి చరిత్ర సృష్టించింది ఓ హీరోయిన్.

actress Shweta Tiwari pays alimony to her ex-husband Raja Chaudhary

ప్రముఖ నటి శ్వేతా తివారీ తన మాజీ భర్త రాజా చౌదరితో విడాకుల వ్యవహారంలో తీసుకున్న నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 2007లో విడాకుల సెటిల్‌మెంట్‌లో భాగంగా శ్వేతా, రాజాకు సుమారు రూ. 93 లక్షల విలువైన ఒక బెడ్‌రూమ్ ఫ్లాట్‌ను బదలాయించినట్లు సమాచారం.

1998లో వివాహం చేసుకున్న ఈ జంట, ఐదేళ్ల సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత విడిపోయారు. గృహ హింస, రాజా మద్యపాన అలవాటును విడాకులకు ప్రధాన కారణాలుగా శ్వేత పేర్కొంది. ఈ మొత్తం ప్రక్రియలో శ్వేతాకు అత్యంత ముఖ్యమైనది తమ కుమార్తె పలక్ తివారీ సంరక్షణే. అందుకోసం ఆమె తన ఆస్తిని వదులుకోవడానికి కూడా సిద్ధపడ్డారు.

తొలుత రాజా, ఫ్లాట్‌ను పలక్‌తో ఉమ్మడి యాజమాన్యంగా ఉంచాలనే ప్రతిపాదనను తిరస్కరించినప్పటికీ, శ్వేతా మాత్రం పలక్ సంరక్షణే తనకు కీలకమని భావించి, ఆ ఫ్లాట్‌ను పూర్తిగా వదిలివేసింది. "నా కుమార్తె సంరక్షణే నాకు అత్యంత ముఖ్యం, పలక్ కంటే ఏదీ ముఖ్యం కాదు" అని ఆమె స్పష్టం చేసింది. తన కుమార్తె భవిష్యత్తు కోసం శ్వేతా చూపిన ఈ త్యాగం పలువురి ప్రశంసలు అందుకుంటోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+