సూపర్ టేస్టీ 'బాదం బర్ఫీ'.. ఇలా ఈజీగా తయారు చేసుకోండి..!
స్వీట్స్ అనగానే చాలామందికి నోరూరుతుంది. చిన్న పిల్లల దగ్గర్నుంచి పెద్దల వరకు స్వీట్స్ ను లొట్టలేసుకుంటూ తింటారు. ఇక మనం ఇంట్లో రకరకాల స్వీట్స్ ను తయారు చేసుకుంటూ ఉంటాం. అయితే ఎప్పుడైనా బాదం బర్ఫీ స్వీట్ ను తయారు చేసుకున్నారా..? ఈ స్వీట్ ను ఎప్పుడైనా ట్రై చేశారా..? రుచికి రుచితోపాటు ఆరోగ్యానికి కూడా ఈ స్వీట్ ఎంతో మేలు చేస్తుంది. మరి ఈ సూపర్ టేస్టీ బాదం బర్ఫీ స్వీట్ ను ఎలా తయారు చేసుకోవాలి..? కావాల్సిన పదార్థాలు ఏంటి..? ఇంట్లోనే సులభంగా ఈ స్వీట్ ను ఎలా రెడీ చేసుకోవాలి..? ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.
బాదం బర్ఫీ తయారీకి కావాల్సిన పదార్థాలు చూస్తే ముందుగా బాదం పప్పులు ఒక కప్పు, చక్కెర ముప్పావు కప్పు, పాలు సరిపడా, నెయ్యి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ లు, యాలకుల పొడి అర టేబుల్ స్పూన్ తీసుకోవాలి. ఇప్పుడు తయారీ విధానం చూస్తే ముందుగా బాదంను వేడి నీళ్లలో 30 నిమిషాలపాటు నానబెట్టుకోవాలి. అలా నానబెట్టుకున్న తర్వాత వాటిపైన ఉన్న పొట్టును తీసేయాలి.

ఇప్పుడు బాదం పలుకులను మిక్సీలో వేసి అందులో పాలు పోసి బరకగా రుబ్బుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో చక్కెర వేయాలి. ఆ తర్వాత అందులోనే బాదం పేస్టు వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఆ మిశ్రమంలో యాలకుల పొడి, నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ప్లేల్ లో వేయాలి. కొద్దిగా చల్లారిన తర్వాత కట్ చేసుకోవాలి. అంతే సూపర్ టేస్టీ బాదం బర్ఫీ రెడీ అయినట్టే.. మీరూ ఇలా ఓసారి ట్రై చేసుకోండి..












Click it and Unblock the Notifications