నిర్మాతలపై సంచలన వ్యాఖ్యలు చేసిన నటి సోనాలి బింద్రే...!
ఒకప్పటి బాలీవుడ్, టాలీవుడ్ నటి సోనాలిబింద్రే నిర్మాతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె చేసిన ఈ వాఖ్యలు కాస్త ఇప్పడు నెట్టింట్లో తెగ వైరల్‌గా మారాయి. ఒకానొక సమయంలో అటు బాలీవుడ్‌లోనూ ఇటు టాలీవుడ్‌లోనూ వరుస సినిమాలు చేసి స్టార్‌గా హీరోయిన్ అయిపోయారు సోనాలిబింద్రే. ఆమె టాలీవుడ్‌లో పెద్ద పెద్ద హీరోలందరితో నటించారు.
ఆమె నటించిన చిత్రాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్‌లే. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, మహేష్‌బాబు వంటి స్టార్ హీరోలందరితోనూ నటించింది. బాలీవుడ్‌లో కూడా ఈమె నటించిన చిత్రాలన్నీ మంచి విజయాలను అందుకున్నాయి. కానీ, ఆ తర్వాత సోనాలి సినిమాలకు దూరమయ్యారు. సుమారు పదేళ్లతర్వాత ఆమె మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అది కూడా ఓ వెబ్‌సిరీస్‌తో.

'ది బ్రోకెన్ న్యూస్' సీజన్ 2 అనే వెబ్‌సీరిస్‌తో సోనాలి మరోసారి ప్రేక్షకులను అలరిస్తున్నారు. అయితే, ఈ వెబ్‌సిరిస్ ప్రమోషన్‌లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నటి సోనాలి నిర్మాతలపై సంచలన కామెంట్స్ చేశారు. అవి కాస్త ఇప్పడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. నిర్మాతలే రూమర్స్‌ను క్రియేట్ చేసేవాళ్లు.. నిర్మాతలే తనని బాడీ షేమింగ్ చేసేవారని ఆమె అన్నారు.
నిర్మాతలే రూమర్స్ క్రియేట్ చేసేవాళ్లు..
నేను ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పడు పరిస్థితులు చాలా భిన్నంగా ఉండేవి. నా తోటి నటులకి నాకు మధ్య నిర్మాతలే రూమర్స్ క్రియేట్ చేసేవారు. వాటిలో ఏ మాత్రం నిజం లేకపోయినా సరే సినిమా ప్రమోషన్ అవుతుందనే ఉద్దేశంతో అలా చేసేవాళ్లు. నిజం చెప్పాలంటే ఇప్పటికీ ఈ చెత్త ట్రెండ్ ఇండస్ట్రీలో నడుస్తూనే ఉంది. రూమర్స్‌ను మీడియాకి నిర్మాతలే లీక్ చేసేవాళ్లు. ఈ విషయం తెలిసి అప్పట్లో నేను షాకయ్యా అంటూ అప్పటి విషయాలను చెప్పకొచ్చారు సోనాలిబింద్రే. అంతేకాదు తనని నిర్మాతలు బాడీ షేమింగ్ కూడా చేసేవారని తెలిపింది.
నేను ఇండస్ట్రీకి వచ్చినప్పడు చాలా సన్నగా ఉండేదాన్ని. దీంతో నిర్మాతలు నన్ను బాడీ షేమింగ్ చేసేవాళ్లు. నాపై జోకులు కూడా వేసుకునేవారు. అప్పట్లో హీరోయిన్లంతా కాస్త లావుగా ఉండేవారు. నన్ను కూడా అలా తయారవ్వమని చెప్పేవారు. కానీ, నేనేప్పడూ వారి మాటలను పట్టించుకోలేదు. నేను ఎలా ఉన్నానో అలాగే నన్ను అభిమానులు అదరించారు. స్టార్ హీరోయిన్‌ని చేశారు అంటూ చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications