ఏకంగా 13 సినిమాల్లో నుంచి ఆ స్టార్ బ్యూటీని తీసేశారని తెలుసా..?
ప్రముఖ హిందీ నటి విద్యా బాలన్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే. 2005లో 'పరిణీత'చిత్రంతో తెరంగేట్రం చేసిన విద్య.. ఆ తర్వాత 'లగే రహో మున్నాభాయ్'తో ప్రేక్షకుల్లో గుర్తింపు పొందింది. ఆ తర్వాత 'పా', 'ఇష్కియా', 'నో వన్ కిల్డ్ జెస్సికా' మరింత చేరువైంది. ఇక 2011 లో వచ్చిన 'ది డర్టీ పిక్చర్'మూవీలో సిల్క్ స్మిత పాత్రలో నటించి ఆడియన్స్ ని మాత్రమే కాకుండా విమర్శకులను సైతం మెప్పించింది. అంతే కాకుండా ఫిలింఫేర్, నేషనల్ అవార్డులతో సహా అనేక పురస్కారాలు గెలుచుకుంది.
అంతే కాకుండా బాలీవుడ్‌తో పాటు తెలుగులో కూడా నందమూరి తారక రామారావు గారి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన 'ఎన్.టి.ఆర్: కథానాయకుడు' మరియు 'ఎన్.టి.ఆర్: మహానాయకుడు' చిత్రాలతో నటించింది. ఆ బయోపిక్స్‌లో విద్యా బాలన్.. ఎన్.టి.ఆర్. సతీమణి బసవతారకం పాత్రలో జీవించేశారు అని చెప్పొచ్చు. ఈ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని సాధించకపోయినప్పటికీ.. తెలుగు వారికీ ఎప్పుడూ గుర్తుండి పోయేలా మనసులు గెలుచుకున్నారు.

ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తున్న విద్యా.. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె కెరీర్ తొలినాళ్లలోని చేదు అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు. సినీ పరిశ్రమ నిరంతరం మారుతూ ఉండే అద్భుత ప్రపంచమని ఇక్కడ ఎవరి కెరీర్ ఎప్పుడు ఎలా మలుపు తిరుగుతుందో అంచనా వేయడం కష్టమన్నారు. ఎంతోమందికి గొప్ప అవకాశాలు చివరి నిమిషంలో చేజారిపోతుంటాయి. అలాంటి ఎన్నో కష్టాలను ఎదుర్కొని, ఏకంగా 13 సినిమాల నుంచి తొలగించబడినా మళ్లీ ఆత్మవిశ్వాసంతో ఎదిగినట్టు చెప్పుకొచ్చారు.
ఇంకా మాట్లాడుతూ.. వెండితెరపై తన ప్రయాణం అనుకున్నంత సాఫీగా సాగలేదని.. అవకాశాలు రానప్పుడు, తన ఆత్మవిశ్వాసం ఎంతగా దెబ్బతినిందంటే, అద్దంలో తన ముఖాన్ని చూసుకోవడానికి కూడా సంకోచించేదాన్నని వెల్లడించారు. తనలో ఏదో లోపం ఉందేమోనని కుంగిపోయిన సందర్భాలున్నాయని తెలిపారు. ఒక దశలో తనను 'అన్‌లక్కీ హీరోయిన్' అని పిలిచేవారని, అలా విన్న ప్రతీసారి రాత్రులు ఏడుస్తూ నిద్రపోయేదాన్నని ఆవేదన వ్యక్తం చేశారు.













Click it and Unblock the Notifications