కొడుకు ఇజ్జత్ తీసిన పూరీ.. నీ రేంజ్ ఇదే.. హీరోగా పనికిరావంటూ..!

సాధారణంగా ఏ సెలబ్రిటీకైనా తమ వారసత్వం కూడా సినీ ఇండస్ట్రీలో రాణించాలని అనుకుంటూ ఉంటారు. ముఖ్యంగా హీరోలైతే తమ కుమారుడు హీరోగానే వారసత్వాన్ని కొనసాగించాలని భావిస్తుంటారు. దర్శకులు సైతం తమ వారసులను కథానాయకుడి పాత్రలోనే ఊహించుకుంటారు. అయితే టాలీవుడ్ టాప్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్.. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. కష్టాన్ని నమ్ముకుని విలక్షణమైన స్క్రిప్ట్స్ తో వరుస బ్లాక్ బస్టర్స్ సాధించారు. పవన్ కల్యాణ్, మహేశ్ బాబు లకు బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు.

అయితే ఇస్మార్ట్ శంకర్ తర్వాత ఆయన నుంచి సరైన హిట్ రాలేదు. లైగర్, ఇస్మార్ శంకర్ 2 సినిమాలు బాక్సాఫీస్ ముందు డిజాస్టర్స్ గా నిలిచాయి. దీంతో పూరీ.. ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టి ట్రాక్ లోకి రావాలని కసితో ఉన్నారు. ఈ క్రమంలో తమిళ ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ మూవీకి ఛార్మీ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో సీనియర్ నటి టబు, కన్నడ స్టార్ దునియా విజయ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Akash Puri Joins Cast of Puri Jagannadh Vijay Sethupathi Film

అయితే ఈ సినిమాలో తన కుమారుడు ఆకాశ్ కు పూరీ జగన్నాథ్ ఓ పాత్ర ఇస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇది కేవలం సైడ్ క్యారెక్టర్ అని సమాచారం. ఇక అసలు విషయం ఏంటంటే.. పూరీ తన కెరీర్ లో ఎంతో మందికి లైఫ్ ఇచ్చారు. రామ్ చరణ్ నుంచి ఎందరో స్టార్ కిడ్స్ కు హిట్ ఇచ్చారు. కానీ కన్న కొడుక్కి మాత్రం సరైన హిట్ ఇచ్చి ప్లాట్ ఫామ్ క్రియేట్ చేయడంలో ఫెయిల్ అయ్యారు.

ఇదే విషయంపై ఇప్పుడు నెట్టింట కామెంట్స్ వినిపిస్తున్నాయి. పూరి దగ్గర చాలా స్క్రిప్ట్స్ ఉన్నా ఆకాశ్ తో సినిమా చేయడని.. ఇలా సైడ్ క్యారెక్టర్స్ ఇస్తూ కావాలనే ఆకాశ్ పరువు పూరీ తీస్తున్నాడని కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై పూరీ టీమ్ నుంచి ఎలాంటి స్పందన లేదు. మరి ఈ మూవీతోనైనా ఆకాశ్ ను మంచి పాత్ర దొరుకుతుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. మరి కొడుకు కోసం పూరీ ఎలాంటి పాత్ర డిజైన్ చేశాడో చూడాలంటే సినిమా రిలీజ్ అవ్వాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+