శుభవార్త చెప్పిన అక్కినేని ఫ్యామిలీ
అతి త్వరలోనే అక్కినేని ఇంట్లో మరో పెళ్లి జరగనుంది. అక్కినేని నాగార్జున రెండో తనయుడు అఖిల్ పెళ్లికి సిద్ధమవుతున్నారు. దీనికి సంబంధించి కీలక విషయాన్ని నాగార్జున వెల్లడించారు. జైనాబ్ రవద్జీ అనే మహిళను అఖిల్ అక్కినేని సైలెంట్‌గా నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ విషయాన్ని నాగార్జున తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.అఖిల్ చాలాకాలం నుంచి నటి జైనాబ్ రవద్జీ ప్రేమలో ఉన్నారు.
వీరిద్దరూ తమ రిలేషన్‌ను పెళ్లిగా మార్చుకోవాలని భావిస్తున్నారు. ఈక్రమంలోనే తమ ప్రేమ గురించి ఇరు కుటుంబాల్లో చెప్పడం వారు ఓకే చెప్పడం అన్నీ కూడా చక చక జరిగిపోయాయి. అటు నాగార్జున సైతం అఖిల్ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.మార్చి24న అక్కినేని వారసుడు అఖిల్-జైనల్‌ల వివాహం ఘనంగా జరగబోతున్నట్లు తెలుస్తోంది.ఈ పెళ్లికి సంబంధించిన పూర్తి పనులను ఇరు కుటుంబ సభ్యులు చూసుకోబోతున్నారు. అయితే ఈ వేడుకకు బిజినెస్ పర్సన్స్‌తో పాటు సినీ సెలబ్రిటీలు, క్రికెటర్స్ హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది.ఈ విషయం తెలుసుకున్న అక్కినేని అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

అఖిల్ మొదట శ్రీయ భూపాల్ అనే అమ్మాయిని ప్రేమించాడు. వీరిద్దరికి నిశ్చితార్థం కూడా జరిగింది. ఏం జరిగిందో తెలియదు కానీ అఖిల్‌తో శ్రీయ భూపాల్ పెళ్లి క్యాన్సిల్ చేసుకుంది. కొన్నాళ్లు సింగిల్‌గా ఉన్న అఖిల్,తర్వాత జైనాబ్ రవద్జీతో ప్రేమలో పడ్డారు. ప్రస్తుతం వీరిద్దరు నిశ్చితార్థం చేసుకున్నారు. ఇక అఖిల్ కెరీర్ విషయానికి వస్తే..అఖిల్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తరువాత అఖిల్ నటించిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. బ్యాచ్‌లర్ సినిమానే యావరేజ్‌గా నిలిచింది. ఇక భారీ అంచనాల మధ్య విడుదలైన ఏజెంట్ సినిమా అట్టర్ ఫ్లాప్‌గా నిలిచింది. దీంతో ఈసారైనా హిట్ కొట్టాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. దీంతో సినిమాల నుంచి అఖిల్ కొంత గ్యాప్ తీసుకున్నాడు.
-
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!!












Click it and Unblock the Notifications