అక్కినేని ఇంటికి కొత్త కోడలు?
అక్కినేని నాగార్జున ఇంటిలో కొత్త కోడలు దీపాలు వెలిగించబోతోందంటూ వార్తలు వస్తున్నాయి. అక్కినేని అఖిల్ కు గతంలోనే ఎంగేజ్ మెంట్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఇరువురూ బ్రేకప్ చెప్పుకోవడంతో పెళ్లివరకు వెళ్లకపోవడంతో మంచి అమ్మాయిని చూసి పెళ్లిచేయాలనే ఆలోచనలో నాగార్జున ఉన్నారంటున్నారు. త్వరలోనే ఓ బడా బిజినెస్ మ్యాన్ మనవరాలిని అఖిల్ పెళ్లి చేసుకోబోతున్నారని తెలుస్తోంది.
ఇది ప్రేమ వివాహమేనని, సొసైటీలో టాప్ మోస్ట్ బిజినెస్ మెన్ అయిన ఆయన అఖిల్ గురించి, అక్కినేని కుటుంబం గురించి తెలుసని, తన మనవరాలిని అక్కినేని ఇంటికి కోడలిగా పంపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారంటున్నారు. దీపావళిని పురస్కరించుకొని కొత్త కోడలిని తమ ఇంటికి అక్కినేని నాగార్జున-అమల దంపతులు ఆహ్వానించారంటున్నారు. ఆ అమ్మాయే అఖిల్ కు మొదటగా ప్రపోజ్ చేసిందని, అఖిల్ గురించి, అతని బ్రేకప్ గురించి తెలుసని తెలుస్తోంది.

నాగచైతన్య-సమంత విడాకులు తీసుకొని రెండున్నర సంవత్సరాలవుతోంది. అఖిల్ కు వివాహం చేసిన తర్వాత నాగచైతన్య గురించి ఆలోచిద్దామనే ధోరణిలో నాగార్జున ఉన్నారని, అఖిల్ వివాహం అయిన తర్వాత నాగచైతన్యపై నిర్ణయం తీసుకుంటారంటున్నారు. అభిమానులు మాత్రం నాగచైతన్య-సమంత మళ్లీ కలిసిపోవాలని, వారిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని, ఇగోలు ఏమైనా ఉంటే వాటిని ఇద్దరూ పక్కన పెట్టాలని, ఓపెన్ గా మాట్లాడుకోవాలని కోరుతున్నారు. నాగచైతన్య-సమంత కన్నా వారిద్దరూ కలిసిపోవాలని అభిమానులే ఎక్కువగా కోరుకుంటున్నారు.












Click it and Unblock the Notifications