డబుల్ బెడ్‌రూం ఇంటిని కొనుగోలు చేసిన నాగచైతన్య-సమంత

ఏమాయ చేశావే సినిమాతో అక్కినేని నాగచైతన్య, సమంత పరిచయం జరిగింది. ఈ బ్లాక్ బస్టర్ సినిమాలో ఇద్దరూ హీరోహీరోయిన్లు నటించారు. ఆరు నుంచి ఏడు సంవత్సరాలపాటు గాఢంగా ప్రేమించుకున్నారు. అనంతరం పెద్దల అంగీకారంతో వివాహం జరిగింది. వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా కాపురం చేశారు. జంట చాలా బాగుంది.. నూరేళ్లు పిల్లాపాపలతో ఉండండి అంటూ పెద్దలంతా దీవెనలందిస్తున్న తరుణంలో హఠాత్తుగా నాలుగు సంవత్సరాలకే విడాకులు తీసుకొని అందరికీ షాక్ ఇచ్చారు. అప్పటి నుంచి ఎవరికి వారుగా జీవిస్తున్నారు.

మురళీమోహన్‌కు నాగార్జున రికమండేషన్
నటుడు, వ్యాపారవేత్త మురళీమోహన్ జయభేరి గ్రూప్ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటారు. ఆయన ఎంతో ముచ్చటపడి ఓ పెంట్ హౌస్ కట్టించుకున్నారు. అందులోనే ఓ డబుల్ బెడ్ రూం ఇల్లు ఉంది. అది నాగచైతన్యకు అమ్మాలంటూ నాగార్జున మురళీమోహన్ కు రికమెండ్ చేయడంతో ఆయన అమ్మారు. వివాహమైన తర్వాత వీరిద్దరూ ముడు సంవత్సరాలపాటు ఆ ఇంట్లోనే కాపురం పెట్టారు. వీరి ఇంటికి పక్కనే మురళీమోహన్ నివసించేవారు. ప్రతిరోజు ఆయనతోపాటు నాగచైతన్య-సమంత కూడా వాకింగ్ చేసేవారు.

akkineni nagachaitanya and samantha purchase double bedroom house

పనిమనిషి చెప్పడంతో షాకైన మురళీమోహన్
ఉదయం వాకింగ్ కు వచ్చిన తర్వాత వీరిద్దరూ మురళీమోహన్ కు ప్రతిరోజు నమస్కారం చేసేవారు. జంట ఎంతో బాగుంది.. చక్కగా కాపురం చేసుకుంటున్నారు.. అన్యోన్యంగా ఉంటున్నారు అని ఆయన ఆనందపడ్డారు. వారి ఇంట్లోనే ఓ పనిమనిషి ఉండేది. ఆమెతో కూడా వీరిద్దరికీ మంచి పరిచయం ఉంది. ఒకరోజు హఠాత్తుగా ఆ పనిమనిషి మురళీమోహన్ కు చైతూబాబు, సమంత విడిపోతున్నారని చెప్పడంతో ఒక్కసారిగా ఆయనకు షాక్ కొట్టినంత పనైంది. వారిద్దరూ విడిపోకుండా ఉండటానికి మురళీమోహన్ ఎంతో ప్రయత్నించారుకానీ విడిపోవాలని వారిద్దరూ బలమైన నిర్ణయం తీసుకోవడంతో ఏమీ చేయలేకపోయానని ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+