"కొన్ని చెప్పకూడదు" అంటూ.. రమ్య కృష్ణ, టబు గురించి ఓపెన్ అయిన నాగార్జున !
అక్కినేని నాగార్జున.. ఏఎన్నార్ వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి.. తనదైన శైలిలో విభిన్న పాత్రలు పోషించి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. అంతే కాకుండా ఆరు పదుల వయసులోనూ అదే అందంతో అప్ కమింగ్ హీరోస్ కి కూడా పోటీ ఇచ్చేలా ఉన్నారు.
శివ, సూపర్, కింగ్ లాంటి క్యారెక్టర్స్ అయినా.. ఆవిడా మా ఆవిడే, చంద్ర లేఖ లాంటి హుషారెత్తించే పాత్రలైనా.. అన్నమయ్య, భక్త రామదాసు, షిర్డి సాయి లాంటి డివోషనల్ పాత్రలైనా ఆయనకే సాటి అనేలా నిరూపించుకున్నారు. కెరీర్ లో ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ చూసిన నాగ్ ఇప్పుడు తన పంథా మార్చుకున్నారు.

ఇటీవల కుబేర మూవీలో ఓ కీలక పాత్రలో నటించి మెప్పించారు. ఇక లేటెస్ట్ రజనీకాంత్ కూలీ చిత్రంలో స్టైలిష్, స్మార్ట్ విలన్ క్యారెక్టర్ చేస్తున్నారు. అయితే ఆయన పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే సాధారణంగా ఛైర్లు పలువురు హీరోయిన్స్ తో రిలేషన్ లో ఉన్నట్టు వార్తలు రావడం సహజమే.
ఇక నాగ్ కెరీర్ లో అయితే ముఖ్యంగా అలా వినిపించే పేర్లు టబు, రమ్యకృష్ణ అనడంలో సందేహం లేదు. అయితే నటుడు జగపతిబాబు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సెలబ్రిటీ టాక్ షో 'జయమ్ము నిశ్చయమ్మురా'. ఈ ప్రోగ్రాం తొలి ఎపిసోడ్‌కు నాగార్జున ముఖ్య అతిథిగా హాజరై.. టబు, రమ్యకృష్ణ గురించి షాకింగ్ కామెంట్స్ చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
లేటెస్ట్ గా రిలీజ్ అయిన ప్రోమోలో.. నా స్నేహితుడంటూ నాగార్జునను జగపతిబాబు ఆహ్వానించారు. 'ఏం దాచుకోకుండా మాట్లాడుకునే షో ఇది' అని హోస్ట్ జగపతి బాబు చెప్పగా.. ఓకే అంటూ నవ్వులు కురిపించారు నాగ్. 'రమ్యకృష్ణ, టబు.. వీరిద్దరిలో బెస్ట్ కో యాక్ట్రెస్ ఎవరు?' అని జగపతి ప్రశ్నించగా 'కొన్ని చెప్పకూడదు.. నేను చెప్పను' అని సరదాగా పేర్కొన్నారు నాగార్జున.
అలానే 'రమ్యకృష్ణ, సౌందర్య.. ఈ ఇద్దరిలో నీకు ఇష్టమైన నటి ఎవరు?' అని నాగార్జున అడగ్గా.. ఇది నా ఇంటర్వ్యూ కాదంటూ సమాధానాన్ని దాట వేశారు జగపతిబాబు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.












Click it and Unblock the Notifications