పవన్ కల్యాణ్ అలాంటి వ్యక్తే.. మొత్తానికి ఓపెన్ అయిన అల్లు అర్జున్
నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ కొత్త సీజన్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. అన్‌స్టాపబుల్ షో నాలుగో సీజన్‌ను ఘనంగా ప్రారంభించారు.మొదటి ఎపిసోడ్‌లో ఏపీ సీఎం చంద్రబాబు చీఫ్ గెస్ట్ రాగా, ఆ తర్వాత హీరో దుల్కర్ సల్మాన్, సూర్య వంటి హీరోలు షోలో సందడి చేశారు. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అన్‌స్టాపబుల్‌కు రావడం జరిగింది. దీనికి సంబంధించిన ప్రోమో కూడా విడుదల చేశారు. ప్రోమోలో అల్లు అర్జున్‌ను బాలకృష్ణ పలు ఆసక్తికర ప్రశ్నలు అడుగుతూ కనిపించారు.
రొమాన్స్ ఇష్టమా, యాక్షన్ ఇష్టమా అని ప్రశ్నించగా, తొక్కలో యాక్షన్, రొమాన్స్ అంటే ఇష్టమని అల్లు అర్జున్ తేల్చేశారు. హీరోయిన్లలో ఎవరంటే ఇష్టమని ఈ సందర్భంగా అల్లు అర్జున్‌ను బాలకృష్ణ ప్రశ్నించారు. హీరోల గురించి అడుగుతారేమో అని భయపడ్డానని అల్లు అర్జున్ సరదాగా స్పందించడం ప్రోమోలో చూపించారు. తాజాగా విడుదల చేసిన ప్రోమోలో హీరోల గురించి అల్లు అర్జున్‌ను ప్రశ్నించారు బాలకృష్ణ. పవన్ కల్యాణ్ గురించి ప్రశ్నించగానే, ఆయన ముక్కుసూటి తత్వం అంటే ఇష్టమని, ఎవరు ఏమనుకున్నా తాను అనుకున్నది చేస్తారని పవన్ కల్యాణ్ గురించి అల్లు అర్జున్ చెప్పడం జరిగింది.

ఇక ప్రభాస్ గురించి అడగ్గానే..ప్రభాస్ గురించి నాది అప్పుడు , ఇప్పుడు ఒకే మాట అని ప్రభాస్ ఆరుడుగుల బంగారమని తేల్చేశారు. ఇక షోకు అల్లు అర్జున్‌తో పాటు, ఆయన తల్లి నిర్మల కూడా హాజరయ్యారు. గత ఎన్నికల దగ్గర నుంచి అల్లు , మెగా ఫ్యామిలీల మధ్య కొంత విభేదాలు చేసుకున్నాయి. పవన్ కల్యాణ్‌ను కాదని, అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి మద్దతుగా నిలిచారు. అప్పటి నుంచి అల్లు , మెగా ఫ్యామిలీ కొంత గ్యాప్ కనిపిస్తోంది.మెగా హీరోలు పలు సందర్భాల్లో అల్లు అర్జున్‌పై పరోక్షంగా కాముెంట్స్ చేస్తూ వస్తున్నారు. ఇటువంటి సమయంలో అన్‌స్టాపబుల్ షోలో పవన్ కల్యాణ్ గురించి అల్లు అర్జున్ ఎలాంటి కామెంట్స్ చేసి ఉంటారా అని అంతా అతృతుగా ఎదురు చూస్తున్నారు. దీనికి సంబంధించిన ఫుల్ ఎపిసోడ్ శుక్రవారం ప్రసారం కానుంది.












Click it and Unblock the Notifications