పవన్‌కు అల్లు అర్జున్ కౌంటర్స్..అప్పుడు : చెప్పను బ్రదర్, ఇప్పుడు : ఇష్టమైన వాళ్ల కోసం ఎక్కడకైనా వెళ్తా

చెప్పను బ్రదర్ అనగానే ఎవరికైనా అల్లు అర్జున్ గుర్తొస్తాడు. ఈ హీరో అప్పట్లో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. పవన్ పేరు ప్రస్తావించకుండా కొన్నాళ్ల పాటు పవన్ ఫ్యాన్స్ అగ్రహానికి గురయ్యాడు ఈ హీరో. అల్లు అర్జున్ 'సరైనోడు' బ్లాక్ బస్టర్ ఈవెంట్‌లో బన్నీ పవన్ కళ్యాణ్ గురించి చేసిన ఓ కామెంట్ సోషల్ మీడియాలో పెద్ద సంచలనమే సృష్టించింది. మెగా హీరోలకు సంబంధించిన ఏ సినీ ఫంక్షన్ జరిగినా పవన్ ఫ్యాన్స్ 'పవర్ స్టార్.. పవర్ స్టార్' అని అరవడం....సీరియస్ గా మాట్లాడుతున్న వారిని డిస్ట్రబ్ చేయడం లాంటివి చేయడం కొత్తేమీ కాదు.

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తీరు చూసిన విసిగి పోయిన వారిలో చిరంజీవితో పాటు నాగబాబు కూడా ఉన్నారు. ఓ ఫంక్షన్లో అయితే నాగబాబు ఏకంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి వార్నింగే ఇచ్చారు. బన్నీ కూడా ఇలాగే చిర్రెత్తిపోయారు. తాను సినిమా గురించి సీరియస్ గా మాట్లాడుతుంటే...పవన్ స్టార్ గురించి చెప్పాలని కొందరు ఫ్యాన్స్ గోల చేయడంతో 'నేను చెప్పను బ్రదర్' అంటూ చిర్రెత్తిపోయారు. ఈ మాటతో పవన్ కళ్యాణ్ అభిమానులకు బన్నీ ఎనిమీ అయ్యాడు.. కొంతమంది అల్లు అర్జున్ కు సక్సెస్ తలకెక్కింది అని మండిపడితే, మరికొంతమంది పవన్ పేరు నిజంగానే చెప్పాల్సిన అవసరం లేదని బన్నీకి సపోర్ట్‌గా నిలిచారు.ఫేస్ బుక్, ట్విట్టర్ ఆలో అయితే #CheppanuBrother హ్యాష్ ట్యాగ్ టాప్ ట్రెండింగ్ లిస్టులో చేరిపోయింది.

allu arjun indirect satires on pawan kalyan

మళ్లీ ఇన్నాళ్లుకు మరోసారి మెగా ఫ్యామిలీపై పరోక్షంగా అల్లు అర్జున్ కామెంట్స్ చేశారు. గత కొంతకాలంగా మెగా వర్సెస్ అల్లు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయని అనేక కథనాలు వెలువడుతున్నాయి. దీనికి కారణం అల్లు అర్జున్ అన్న సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన ఎన్నికల్లో అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి మద్దతు ప్రకటించారు. అప్పటి నుంచి మెగా ,అల్లు కుటుంబాల మధ్య మాటల్లేవనే చర్చ సాగుతోంది.మెగా ,అల్లు ఫ్యామిలీల మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి.

పైకి అంతా బాగానే ఉందని చెబుతున్నప్పటికి, లోలోపల మాత్రం వివాదాలు ఈ రెండు ఫ్యామిలీల మధ్య గట్టిగానే సాగుతున్నట్టు కనిపిస్తోంది. మెగా వర్సెస్ అల్లు అభిమానుల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి కనిపించింది. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థికి మద్దతు తెలిపిన తర్వాత తొలిసారి అల్లు అర్జున్ బయటకొచ్చారు. సుకుమార్ భార్య నిర్మాతగా వ్యవహరించిన మారుతీ నగర్‌ సుబ్రహ్మణ్యం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అల్లు అర్జున్ హాజరయారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వివాదానికి కేరాఫ్‌గా నిలిచాయి.

ఆయన మాట్లాడుతూ.. 'మై డియర్‌ ఫ్యాన్స్‌.. మీరే నా ఆర్మీ, నా ఫ్యాన్స్‌ అంటే నాకు పిచ్చి. హీరోని చూసి చాలామంది ఫ్యాన్స్‌ అవుతారు, కానీ నేను నా ఫ్యాన్స్‌ని చూసి హీరోనయ్యా. నా నుంచి కొత్త సినిమా వచ్చి మూడేళ్లయినా మీరు చూపే ప్రేమ అస్సలు తగ్గలే. నన్ను ప్రేమించే వాళ్ల కోసం నిలబడగలగాలి. మన అనుకున్న వాళ్ల కోసం ఎంత వరకైనా వెళ్తా..! అంటూ కామెంట్ చేశారు. ఎన్నికలు ముగిసిన తరువాత మొదటిసారి బన్ని ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారాయి. ఇది కచ్చింతంగా మెగా ఫ్యామిలీకి కౌంటరిచ్చారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+