‘పుష్ప-2’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న ప్రెస్టీజియస్ మూవీ 'పుష్ప-2' సినీ యావత్తు మొత్తం కూడా ఎంతో అతృతుగా ఎదురు చూస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ మరోసారి బాక్సాఫీస్ దగ్గర తన మ్యాజిక్ చూపించడానికి రెడీ అవుతున్నాడు. 'పుష్ప-2'తో రికార్డులు బద్దలు కొట్టడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. దానికి తగ్గట్టుగానే ఈ చిత్ర ట్రైలర్ కట్ కూడా ఉండటంతో ఈ మూవీ కోసం నేషన్‌వైడ్‌గా అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.
Oh damn, #RashmikaMandanna will make you Sexy & Horny during watching #Pushpa2. Her chemistry with #AlluArjun is WILDFIRE ! Her dialogues totally Paisa Vasool specially in First Half. #Pushpa2 has Repeat Value. Public will LOVE this Mass STORM ! BLOCKBUSTER on the way. 🌟🌟🌟🌟 pic.twitter.com/rXOyMsBte9
— Umair Sandhu (@UmairSandu) December 3, 2024
ఇక పుష్ప సినిమాకు గానూ అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ హీరో అవార్డు సైతం గెలుచుకున్నారు.జాతీయ అవార్డు అందుకున్న తొలి తెలుగు హీరోగా అల్లు అర్జున్ నిలిచారు. బన్నీ తన మ్యానరిజంతో, యాక్టింగ్‌తో పుష్పను పాన్ ఇండియా స్థాయిలో నిలబెట్టేశాడు. ఈ సినిమాలో అల్లు అర్జున్ నటనకు నార్త్ ఆడియోన్స్ ఫిదా అయ్యారు. నార్త్ ఆడియెన్స్‌కు పుష్ప బాగా ఎక్కేసింది. అందుకే పుష్ప అక్కడ వంద కోట్లు కొల్లగొట్టేసింది. దీంతో 'పుష్ప-2'పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా ఈ సినిమా కోసం నార్త్ ఆడియెన్స్ ఎంతో అతృతుగా ఎదురు చూస్తున్నారు. పుష్ప-2 సినిమా వచ్చే గురువారం(డిసెంబర్ 5) భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

ఒక రోజు ముందుగానే (డిసెంబర్ 4) కొన్ని చోట్ల ప్రీమియర్ షోలు వేయడానికి చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. తాజాగా పుష్ప-2 సినిమాపై ప్రముఖ సినీ క్రిటిక్ ఉమైర్ సందు తన రివ్యూను ఇచ్చేశారు. పుష్ప 2 సినిమా ఫస్ట్ రివ్యూ అంటూ ఈ సినిమా బ్లాక్ బస్టర్ పైసా వసూల్ ఎంటర్టైనర్ అంటూ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు.సుకుమార్ డైరెక్షన్లో అల్లు అర్జున్ అద్భుతమైన నటనతో అదరగొట్టారని ఈ సినిమా ద్వారా అల్లు అర్జున్ ఇప్పుడు నంబర్ వన్ పాన్ ఇండియా స్టార్ హీరో అంటూ చెప్పుకోవచ్చారు. ఈ సినిమా విషయంలో ఎవరు కూడా జలసీగా ఫీల్ అవ్వద్దు అని అందరూ సపోర్ట్ చేయాలని తెలిపారు. ప్రస్తుతం ఉమైర్ సందు చేసిన ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications