Pushpa-2 ట్విటర్ రివ్యూ: బొమ్మ దద్దరిల్లింది..ఫ్యాన్స్‌కు పూనకాలే..!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 సినిమా డిసెంబర్ 5వ తేదీన విడుదల కానుంది. అయితే అభిమానుల కోసం ఈ క్రేజీ మూవీని ఒకరోజు ముందే దేశవ్యాప్తంగా ప్రీమియర్ షోగా వేశారు.పాన్ ఇండియా మూవీ కావడంతో భాషతో సంబంధం లేకుండా అభిమానులు బన్నీ సినిమాను ముందుగా చూసేందుకు సాయంత్రం 7 గంటల నుంచే థియేటర్ల ముందర క్యూ కట్టారు. అదే సమయంలో హంగామా చేశారు. పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా... ఇంటర్నేషనల్ అంటూ డైలాగులు చెబుతూ సందడి చేశారు. ఇక థియేటర్ల ముందు అల్లు అర్జున్ భారీ కటౌట్లు దర్శనమిచ్చాయి. ఇక ప్రీమియర్ షో చూసిన అభిమానుల రియాక్షన్, సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.

అల్లు అర్జున్ పుష్పరాజ్‌గా నటించిన పుష్ప ది రైజ్ 2021 డిసెంబర్ 17న విడుదలై ఎలాంటి సంచలన విజయం నమోదు చేసిందో చెప్పక్కర్లేదు.తూర్పు, పశ్చిమం, ఉత్తరం, దక్షిణం, అని తేడా లేకుండా బొమ్మ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. రికార్డుల పరంగా కూడా సునామీ సృష్టించింది. ఒక్క సినిమాతో అల్లు వారబ్బాయి పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఆ మాటకొస్తే ఖండాతరాలు దాటి అభిమానులను సంపాదించుకున్నాడు.దీంతో జాతీయ అవార్డు అల్లు అర్జున్ కాంపౌండ్‌ను ముద్దాడింది. ఇక మూడేళ్ల గ్యాప్ తర్వాత వస్తున్న పుష్ప ది రూల్ చిత్రం కోసం అభిమానులు కళ్లు కాయలు కాసేలా వేచిచూశారు. ఇక వారి వెయిటింగ్‌కు టైం అయిపోయింది. బొమ్మ స్క్రీన్‌ పై పడింది. దద్దరిల్లింది అంతే. పుష్ప అంటే ఫైర్ అనుకుంటివా... వైల్డ్ ఫైర్ అనే డైలాగ్ ర్యాంప్ ఆడించింది.

Pushpa 2 review

సుక్కు టేకింగ్ సూపర్బ్

ఇక టేకింగ్ పరంగా చూస్తే లెక్కల మాస్టర్ సుకుమార్ హ్యాండ్లింగ్ మామూలుగా లేదు. ప్రతీ సీన్ చాలా పక్కా లెక్కతో చెక్కారు..అదేనండీ తీశారు. అతని కాల్కులేషనే వేరు అన్నట్లుగా సినిమా చూసిన వారు చెబుతున్నారు. సంగీతం విషయానికొస్తే శాం సీఎస్ దేవీశ్రీలు బీజీఎంను ఇచ్చిపడేశారని అంటున్నారు.పాటల్లో దేవీశ్రీ ప్రసాద్ మార్క్ మ్యూజిక్ కనిపించింది. ఇప్పటికే ఆ పాటలు యూట్యూబ్‌లో ఎంతటి సంచలనం నమోదు చేశాయో అందరికీ తెలిసిందే. ఇక పుష్ప -1 చిత్రంలో "ఊ అంటావా మావా ఉఊ అంటావా" అనే పాటకు సమంతా స్టెప్పులేసి అలరించగా.. పుష్ప-2లో దెబ్బలు పడతైరా రాజా అంటూ శ్రీలీల పలకరించింది. పాట పై మొదట్లో అంచనాలు రీచ్ కాకపోయినప్పటికీ స్క్రీన్ పై చూసినప్పుడు మాత్రం దీనమ్మా జీవితం తగ్గేదేలా అన్నట్లుంది.ఇటు భారత్‌తో పాటు ఓవర్సీస్‌లో కూడా ప్రీమియర్ షో వేశారు. సినిమా హిట్ అంటూ ఎక్స్ సోషల్ హ్యాండిల్ మోతెక్కిపోయింది.

పీలింగ్స్ సాంగ్ ఎక్స్‌లెంట్

హీరో ఇంట్రడక్షన్ సీన్ కేకో కేక అంటున్నారు ఫ్యాన్స్. ఇక ఇంటర్వేల్ బ్యాంగ్‌ అయితే అదిరిందని చెప్తున్నారు.పోలీస్ స్టేషన్ సీన్లు గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయని, ఇక పీలింగ్స్ సాంగ్‌కు ఇటు అల్లు అర్జున్ అటు రష్మికలు పోటీ పడి డ్యాన్స్ వేశారని చెబుతున్నారు. సెకండాఫ్‌లో గంగమ్మ జాతరలో కనిపించే సీన్స్ సినిమాకే హైలైట్‌గా నిలిచాయని అభిమానులు అంటున్నారు. ఈ సీన్స్ కోసం మళ్లీ మళ్లీ చూడొచ్చు భయ్యా అని చెబుతున్నారు.ఫైట్స్ విషయానికొస్తే ఫ్యాన్స్ కుర్చీలకు అతుక్కుపోయి చూశామని చెబుతున్నారు. అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే పుష్ప 3 కూడా ఉంటుందట.

మొత్తానికి పుష్ప -2 మరో సంచలన రికార్డు నమోదు చేస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ చిత్రానికి రెండో సారి నేషనల్ అవార్డు వరిస్తుందా.. లేదా పుష్పరాజ్ చెప్పినట్లు నేషనల్ అనుకుంటివా.. ఇంటర్నేషల్ అనే స్థాయిలో అవార్డు సొంతం చేసుకుంటుందా అనేది వేచి చూడాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+