ఎదపై టాటూను మరింత క్లోజ్‌గా చూపిస్తోన్న అనసూయ

యాంకర్ అనసూయ మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్న వారి పేర్లలో అనసూయ కూడా ఒకరు. న్యూస్ రీడర్‌గా కెరీర్ మొదలుపెట్టిన అనుసూయకు జబర్దస్త్ మంచి క్రేజ్‌ను సంపాదించి పెట్టింది. జబర్దస్త్ ద్వారా వచ్చిన ఫేంతో సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకుంది. క్షణం, రంగస్థలం,కథనం, విమానం , పుష్ప, కిలాడి మొదలగు సూపర్ హిట్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

రంగస్థలం సినిమా తరువాత అనసూయ వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ ఆర్టిస్ట్‌గా మారిపోయింది.. హీరోయిన్లతో సమానంగా అనసూయ క్రేజ్ ఉందంటే.. ఆమె ప్రభావం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. బుల్లితెరకు గుడ్ బై చెప్పిన అనసూయ కేవలం వెండితెరకు మాత్రమే పరిమితం అయింది.

anchor anasuya tattoo pics goes viral

ఇక సోషల్ మీడియాలో అనసూయకుచెక్కుచెదరని అభిమానగణం ఆమె సొంతం. అనసూయకు సోషల్ మీడియాలో మిలియన్ల సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు. ఈ హ్యాట్ బ్యూటీ 38 ఏళ్ల వయస్సులో కూడా యంగ్ స్టార్స్‌కు గట్టి పోటినిస్తోంది. ఫిజిక్ మెయిన్‌టైన్ చేసే విషయంలో ఆమె చూపించే శ్రద్ధకు ఎవరైనా ఫిదా అవాల్సిందే. చీర కట్టిన, స్కార్ట్ వేసిన అది అనసూయకే చెల్లింది. అందం,నటనతో చాలామంది అభిమానులను సంపాధించుకున్న అనసూయ.. వివాదాలతో కూడా నిత్యం సహవాసం చేస్తూనే ఉంది.

అనసూయ ఏం చేసిన, ఏం మాట్లాడిన సంచలనమే అన్నట్టుగా ఉంది పరిస్థితి. అయితే ఇదే సమయంలో అనసూయ పలు వివాదాల్లో చిక్కుకుని వార్తల్లో నిలిచారు. అనసూయ పొలిటికల్ ఎంట్రీపై ఇటీవల పెద్ద రచ్చే జరిగింది. అనసూయ పవన్ కల్యాణ్ జనసేన ఎంట్రీ ఇస్తుందని ప్రచారం జరిగింది. అయితే దీనిపై వివరణ ఇస్తూ ..అలాంటిది ఏమీ లేదని తాను ఏ రాజకీయ పార్టీకి మద్దతు ఇవ్వడం లేదని చెప్పుకొచ్చింది.

తాజాగా అనసూయ తన లేటెస్ట్ ఫొటో షూట్‌ను తన సోషల్ మీడియాలో షేర్ చేశారమె. గతంలో కంటే భిన్నంగా అనసూయ అందాలను ఆరబోసింది. లైట్ బ్లూ కలర్ డ్రెస్‌తో హాట్ హాట్ ఫోజులతో కుర్రాళ్ల మతిపోగొట్టింది ఈ హాట్ బ్యూటీ. ఎదపై టాటూ చూపిస్తూ అనసూయ కుర్రాళ్లను మరింత టెంప్ట్ చేస్తోంది . అనసూయ ఎదపై టాటూ ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+