పిల్లల్ని కంటే సరిపోదు... యాంకర్ రష్మి షాకింగ్ కామెంట్స్
బుల్లితెర యాంకర్ రష్మి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన రష్మి.. సినిమాల్లో సరైన అవకాశాలు దొరక్కపోవడంతో బుల్లితెర మీద యాంకర్ అవతారం ఎత్తింది. జబర్థస్త్ షోలో యాంకర్‌గా కనిపించిన తరువాత రష్మి జాతకమే మారిపోయింది. జబర్థస్త్ షో రష్మికి ఫుల్ పాపులారిటీని తెచ్చిపెట్టింది. ముఖ్యంగా రష్మి -సుడిగాలి సుధీర్‌ల మధ్య కెమిస్ట్రీ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. టీవీ రంగంలో రష్మి -సుడిగాలి సుధీర్‌లపెయిర్ సంచలనం సృష్టించారని అని చెప్పాలి.
వీరిద్దరూ కలిసి కనిపిస్తే చాలు ఆ షో సూపర్ హిట్ అనే రేంజ్‌కి వెళ్లిపోయిందంటే వీరి క్రేజ్ ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ షో ద్వారా వచ్చిన పాపులారిటీతో రష్మి పలు సినిమాల్లో హీరోయిన్‌గా కూడా అవకాశాలు దక్కించుకుంది. ఇదిలా ఉంటే రష్మి జంతు ప్రేమికురాలనే విషయం అందరికి తెలిసిందే. కరోనా సమయంలో కూడా ఆమె రోడ్డు మీద ఉన్న జంతువులకు ఆహారం అందించి తన ఉదారతను చాటుకుంది.

జంతువులను ఎవరైనా హింసిస్తే అదే రీతిలో ఫైర్ అయ్యేదామె. తాజాగా ఓ పెంపుడు కుక్క ఐదు నెలల చిన్నారిపై దాడి చేసింది. ఈ ఘటనలో ఆ చిన్నారి మరణించింది. వికారాబాద్ జిల్లా తాండూరులో ఓ ఐదు నెలల చిన్నారిపై పెంపుడు కుక్క దాడిచేయడంతో ఆ చిన్నారి మృతి చెందింది. దీంతో ఆ చిన్నారి పేరెంట్స్ దాడి చేసిన కుక్కను వెంటనే కొట్టి చంపేశారు. తాజాగా ఈ ఘటనపై రష్మి స్పందించారు. ఆ కుక్కను చంపినందుకు చిన్నారి తల్లిదండ్రుల మీద కేసు పెట్టాలని రష్మీ గౌతమ్ డిమాండ్ చేశారు.
చిన్నారిని ఎందుకు పట్టించుకోకుండా వదిలేశారని ఆ పేరెంట్స్‌ని రష్మి ప్రశ్నించారు. కుక్క దాడిచేస్తున్న టైమ్‌లో వారు ఏం చేస్తున్నారు. నిద్రపోతున్నారా?, పిల్లలను కన్న తర్వాత బాధ్యతగా వ్యహరించడం తెలియదా? జంతువులపై చెత్త ప్రచారాన్ని ఆపండి అంటూ కామెంట్ చేసింది. పిల్లల జీవితాలను రిస్క్‌లో పెట్టింది ఎవరు? అదే జంతువుల విషయానికి వస్తే మాత్రం లాజిక్స్ అన్నీ మర్చిపోతారా?.. దయచేసి పెంపుడు జంతువులు ఉన్నవాళ్లు పిల్లల్ని వదిలేయకండని వేడుకుంది. అలాగే బయటి వ్యక్తులపై తమ పెంపుడు జంతువులు దాడిచేయకుండా యజమానులే శిక్షణ ఇవ్వాలని సూచించింది. రష్మి చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.












Click it and Unblock the Notifications