ప్రభాస్ " స్పిరిట్ " మూవీలో యానిమల్ బ్యూటీకి అందుకే ఛాన్స్ వచ్చిందా..?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం మారుతితో రాజా సాబ్.. హను రాఘవపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత సందీప్ రెడ్డితో 'స్పిరిట్' చిత్రం చేయనున్నారు. టీ-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్స్ పై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో ప్రభాస్ పోలీస్ పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. పాన్ వరల్డ్ మూవీగా రాబోతున్న ఈ చిత్రం తెలుగుతో పాటు, ఇంగ్లీష్, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ, చైనీస్, జపనీస్, కొరియన్ భాషల్లో రూపొందించనున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా బిగ్ అప్డేట్ అందించారు.
ఈ సినిమాలో ప్రభాస్ కి జోడీగా యానిమల్ ఫేమ్ " త్రిప్తి డిమ్రి " నటించనుందని ప్రకటించారు. ఈ మేరకు సందీప్ రెడ్డి వంగా సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. 9 భాషల్లో త్రిప్తి దిమ్రి పేరుతో ఉన్న పోస్టర్ ను షేర్ చేసారు. గతంలో సందీప్ రెడ్డి తెరకెక్కించిన 'యానిమల్' సినిమాతో త్రిప్తి డిమ్రి ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారింది. అంతకు ముందు పలు సినిమాల్లో నటించినప్పటికి.. ఈ ఒక్క చిత్రంతో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. 'యానిమల్' సీక్వెల్ గా రూపొందనున్న 'యానిమల్ పార్క్' మూవీలోనూ త్రిప్తి డిమ్రి హీరోయిన్ గా కంటిన్యూ అవ్వనుంది.

దీపికా ఔట్..
అయితే అంతకు ముందు దీపికా పదుకునేని ఈ సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీపికా రూ.15 కోట్ల పారితోషికం డిమాండ్ చేసిందని.. అందుకు నిర్మాతలు కూడా అంగీకరించారని టాక్ నడిచింది. కానీ అఫీషియల్ గా అనౌన్స్ చేయకముందే దీపికని తప్పించినట్లు ప్రచారం జరిగింది. ఈ క్రమంలో పలువురు బాలీవుడ్ హీరోయిన్ల పేర్లు తెర మీదకు వచ్చాయి. కానీ దీపిక మూడు షరతులు పెట్టిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. లాభాల్లో వాటా, తెలుగులో డబ్బింగ్ చెప్పకపోవడం, వర్క్ టైమింగ్స్ లాంటి షరతులు పెట్టిందట. కానీ ఈ షరతులు సందీప్ కి నచ్చకపోవడంతోనే ఆమెను సినిమా నుంచి తప్పించారని సోషల్ మీడియా కోడై కూస్తుంది.
అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు సందీప్. ఆ తర్వాత కబీర్ సింగ్, యానిమల్ సినిమాలతో బాలీవుడ్ లో కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు. దాంతో వరల్డ్ వైడ్ గా అభిమానులను సంపాదించుకున్న ప్రభాస్ తో ఆయన ఏ సినిమా చేస్తారు .. ఎన్ని రికార్డ్స్ కొల్లగొడతారు అని చర్చ నడుస్తోంది. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
The female lead for my film is now official :-) pic.twitter.com/U7JJQqSUVa
— Sandeep Reddy Vanga (@imvangasandeep) May 24, 2025
మరోవైపు మారుతితో రాజా సాబ్ సినిమా చేస్తున్నాడు ప్రభాస్. ఈ సినిమాలో మాళవిక మోహనన్ తో పాటు.. నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో సంజయ్ దత్ కీలకపాత్ర పోషిస్తుండగా.. మురళీ శర్మ, అనుపమ్ ఖేర్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు.












Click it and Unblock the Notifications