మేము ఇంకా విడిపోలేదు.. బాంబు పేల్చిన సెలబ్రిటీ జంట

ఇటీవల కాలంలో విడాకులు తీసుకునే వారి సంఖ్య ఎక్కువుగానే ఉంది. అందులోనూ సెలబ్రిటీల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేకుండాపోయింది. ఏ రోజు ఏ సెలబ్రిటీ విడాకులు గురించి ప్రకటిస్తారో అనే విధాంగా పరిస్థితి మారిపోయింది. సినిమా షూటింగ్ సమయంలో ప్రేమించి పెళ్లి చేసుకోవడం..ఆ తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకోలేక , కలిసి ఉండలేక విడాకుల బాట పడుతున్నారు. చాలామంది సెలబ్రిటీల జీవితాలు ఇలాగే ఉన్నాయి.

భాషతో సంబంధం లేకుండా సెలబ్రిటీలు చాలామంది విడాకులు తీసుకుంటున్నారు. తెలుగులో నాగచైతన్య-సమంత, పవన్ కల్యాణ్ - రేణు దేశాయ్, డైరెక్టర్ క్రిష్, చిరంజీవి కూతురు శ్రీజ, నాగబాబు కూతురు నిహారిక ఇలా చాలామంది తెలుగు సెలబ్రిటీలు విడాకులు తీసుకున్నారు. తమిళంలో కమల్ హాసన్ , ధనుష్, వంటి వారితో పాటు, బాలీవుడ్‌లో హృతిక్ రోషన్, అమీర్ ఖాన్ వంటి సూపర్ స్టార్లు సైతం తమ వైవాహిక జీవితానికి గుడ్ బై చెప్పి ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు.

AR Rahman wife Saira BANU comment goes viral

ఈ లిస్ట్‌లో స్టార్ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కూడా చేరారు. ఏఆర్ రెహమాన్ భార్య సైరా బాను తన భర్త నుంచి విడిపోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.విడాకులపై సైరా బాను మాట్లాడుతూ..తమ మధ్య సయోధ్య చేయలేని దూరం పెరిగిపోయిందని, అందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నానని సైరా బాను తన ప్రకటనలో చెప్పుకొచ్చారు. ఏఆర్ రెహమాన్‌కు ఆయన భార్య విడాకులు ఇవ్వడంపై సినీ వర్గాలు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాయి.

అయితే తాజాగా జంట తిరిగి కలిసిపోవడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల సైరా బాను అనారోగ్యంతో బాధపడితే, ఏఆర్ రెహమాన్ అండగా నిలిచారు.తాజాగా రెహమాన్ సైతం అనారోగ్యానికి గురయ్యారు. ఛాతీలో నొప్పి రావడంతో ఆయన ఆస్పత్రిలో చేరారు.దీనిపై సైరా బాను స్పందించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆమె కోరారు. ఇదే సమయంలో ఆమె మరో విషయాన్ని వెల్లడించారు. తనని రెహమాన్ మాజీ భార్య అని పిలవద్దని ఆమె మీడియాను కోరారు. తాము విడివిడిగా జీవిస్తున్నామే కానీ, విడాకులు తీసుకోలేదంటూ సైరా బాను చెప్పుకొచ్చింది. కష్ట సమయంలో తన భర్త రెహమాన్‌కు అండగా ఉండాలని సాయిరా కోరుకున్నారు. దీంతో ఈ జంట తిరిగి కలిసిపోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+