రకుల్‌కు అచ్చిరాని పెళ్లి.. మరో ఆరు నెలల్లో విడాకులు..?

ప్రముఖ జ్యోతిషుడు వేణు స్వామి గురించి తెలియని వారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండరంటే అతిశేయోక్తి కాదు. సినీ , రాజకీయ ప్రముఖుల జాతకాల గురించి చెబుతూ బాగా ఫేమస్ అయ్యారాయన. ముఖ్యంగా నాగ చైతన్య, సమంత జంట వీడిపోతారని ముందుగానే చెప్పి సంచలనం స‌ృష్టించారు. వీరితో పాటు పలువురు సెలబ్రిటీల గురించి వేణు స్వామి చెప్పినవి చెప్పినట్టుగా జరగడంతో..సోషల్ మీడియాలో ఆయన పెద్ద సెలబ్రిటీగా మారిపోయారు.

అయితే ఆయన ఎన్నికల్లో విషయంలో చెప్పిన జాతకాలు ఫెయిల్ కావడంతో తీవ్ర విమర్శలను మూటగట్టుకున్నారు. తెలంగాణలో కేసీఆర్, ఏపీలో జగన్‌లు సీఎం అవుతారని చెప్పిన వేణు స్వామి జాతకం తప్పని తేలాయి. దీంతో ఆయనపై నెటిజన్లు ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. దీంతో ఇక మీదట తాను ప్రిడిక్షన్ చెప్పనని తేల్చేశారు. ఇదిలా ఉంటే తాజాగా ఆయన ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో పలు ఆసక్తికరవ్యాఖ్యలు చేశారు.

Astrologer Venu Swamy About Rakul Preet Singh Marriage Life

తాను గతంలో చెప్పినవి 90 శాతం సక్సెస్ అయ్యాయని, ఫెయిల్ అయిన 10 శాతం గురించి చెబుతున్నారు కానీ, సక్సెస్ 90 శాతం గురించి ఎవరు మాట్లాడటం లేదని వేణు స్వామి చెప్పుకొచ్చారు. విమర్శకుల గురించి తాను పట్టించుకోనని, పని పాట లేని వారే నాపై విమర్శలు చేస్తారని ఆయన చెప్పుకొచ్చారు. ఈ సమయంలో వేణు స్వామి మాట్లాడుతూ..హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌పై షాకింగ్ కామెంట్స్ చేశారు. రకుల్ ప్రీత్ సింగ్ వివాహం చేసుకున్న తర్వాత అంతగా కలిసిరాదని, ఆమె పలు సమస్యలు ఎదుర్కొంటుందని తానే ముందే చెప్పానని, తాను చెప్పినట్టుగానే ఆమె వైవాహిక జీవితం సాగుతోందని వేణు స్వామి తెలిపారు. రకుల్‌ భర్త జాకీ భగ్నానీ‌‌కు బాలీవుడ్‌లో పూజా ఎంటర్‌‌టైన్‌మెంట్స్ పేరుతో ఓ నిర్మాణ సంస్థ ఉంది. దీని ద్వారా పలు సినిమాలు తెరకెక్కించారు.

ఈ సంస్థ నుంచి ఇటీవల బడే మియా చోటే మియా సినిమా వచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కావడంతో రకుల్‌ భర్త జాకీ భగ్నానీ‌ నష్టాల్లో కూరుపోయారు. దాదాపు రూ.500 కోట్లకు పైగానే నష్టపోయినట్టు ఆయన చెప్పుకొచ్చారు. తాను రకుల్ పెళ్లికి ముందే చెప్పానని, ఇప్పుడు జరుగుతుందని, మరో ఆరు నెలల్లో ఆమె విడాకులు కూడా తీసుకుంటుందని వేణు స్వామి స్పష్టం చేశారు. రకుల్ పెళ్లి , విడాకులు గురించి చెప్పిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+