మరో బాంబు పేల్చిన వేణు స్వామి..వాళిద్దరూ విడిపోవడం ఖాయం
ప్రముఖ జ్యోతిషుడు వేణు స్వామి గురించి తెలియని వారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండరంటే అతిశేయోక్తి కాదు. సినీ , రాజకీయ ప్రముఖుల జాతకాల గురించి చెబుతూ బాగా ఫేమస్ అయ్యారాయన. ముఖ్యంగా నాగ చైతన్య, సమంత జంట వీడిపోతారని ముందుగానే చెప్పి సంచలనం సృష్టించారు. ఆ తర్వాత మెగా డాటర్ నిహారిక విడాకులు, రెబల్ స్టార్ ప్రభాస్ ఆదిపురుష్ సినిమా ఫ్లాప్ గురించి ముందే చెప్పి సోషల్ మీడియాలో ఫుల్ పాపులారిటీని సంపాదించకున్నారాయన.
వీరితో పాటు పలువురు సెలబ్రిటీల గురించి వేణు స్వామి చెప్పినవి చెప్పినట్టుగా జరగడంతో..సోషల్ మీడియాలో ఆయన పెద్ద సెలబ్రిటీగా మారిపోయారు. డింపుల్ హయాతి, రష్మిక, నిధి ఆగర్వాల్ వంటి హీరోయిన్లు వేణు స్వామి చేత జాతక దోష నివారణ పూజలు చేయించుకున్నారంటే ఆయన ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఆయన ఎన్నికల్లో విషయంలో చెప్పిన జాతకాలు ఫెయిల్ కావడంతో తీవ్ర విమర్శలను మూటగట్టుకున్నారు.

తెలంగాణలో కేసీఆర్, ఏపీలో జగన్‌లు సీఎం అవుతారని చెప్పిన వేణు స్వామి జాతకం తప్పని తేలాయి. దీంతో ఆయనపై నెటిజన్లు ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. దీంతో ఇక మీదట తాను ప్రిడిక్షన్ చెప్పనని తేల్చేశారు. ఒకపక్క ఆయన జాతకాలు ఫెయిల్ అవుతున్నాయని తెలిసినప్పటికీ సెలబ్రిటీలు ఆయన్ను మాత్రం వదలడం లేదు. నాగచైతన్య, శోభితలు కూడా ఎక్కువ కాలం కలిసి ఉండరని చెప్పి పెద్ద షాకే ఇచ్చారాయన. వేణు స్వామి వ్యాఖ్యలపై మహిళా కమిషన్‌కి ఫిలిం జర్నలిస్ట్ యూనియన్ అసోసియేషన్ సభ్యులు ఫిర్యాదు చేశారు.
దీనిపై హైకోర్టు మొట్టికాయలు వేయడంతో మహిళా కమిషన్‌కు క్షమాణలు కూడా చెప్పారాయన. ఇదిలా ఉంటే తాజాగా ఆయన మరోసారి కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్‌ల మధ్య విభేదాలు చోటు చేసుకుని, సమస్యలు వస్తాయని వేణు స్వామి చెప్పుకొచ్చారు. జాతకరీత్య త్వరలోనే వీరిద్దరి మధ్య విభేదాలు చోటు చేసుకుంటాయని వేణు స్వామి తెలిపారు.ప్రస్తుతం అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్‌ల గురించి వేణు స్వామి మాట్లాడిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications