ఆ పని చేస్తూ పబ్‌లో దొరికిన వేణు స్వామి
ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదట్లో వేణు స్వామి చెప్పిన మాటలను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కాని సమంత నాగ చైతన్యలు తమ వివాహిక జీవితానికి గుబ్ బై చెబుతారని..మెగా డాటర్ నిహారిక విడాకులు తీసుకుంటుందని ముందే చెప్పి సంచలనం వేణు స్వామి సృష్టించారు. ఆయన చెప్పినట్టుగానే సమంత నాగ చైతన్యలు విడిపోవడం, నిహారిక తన భర్త చైతన్యకు విడాకులు ఇవ్వడం వంటివి చక చక జరిగిపోయాయి.
ఇక ప్రభాస్ విషయంలో వేణు స్వామి మొదటి నుంచి కూడా నెగిటివ్‌గానే చెబుతూ వస్తున్నారు.బాహుబలి తరువాత ప్రభాస్ నటించిన ఏ సినిమా అయిన ఫ్లాప్ అవుతుందని వేణు స్వామి తెలిపారు. ఆయన చెప్పినట్టుగానే సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయ్యాయి. డింపుల్ హయాతి, రష్మిక, నిధి ఆగర్వాల్ వంటి హీరోయిన్లు వేణు స్వామి చేత జాతక దోష నివారణ పూజలు చేయించుకున్నారంటే ఆయన ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక వేణు స్వామి ప్రభావం రాజకీయాలపై కూడా ఉందనే చెప్పాలి. ఆయన ఎన్నికల్లో విషయంలో చెప్పిన జాతకాలు ఫెయిల్ కావడంతో తీవ్ర విమర్శలను మూటగట్టుకున్నారు.

తెలంగాణలో కేసీఆర్, ఏపీలో జగన్‌లు సీఎం అవుతారని చెప్పిన వేణు స్వామి జాతకం తప్పని తేలాయి. దీంతో ఆయనపై నెటిజన్లు ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. దీంతో ఇక మీదట తాను ప్రిడిక్షన్ చెప్పనని తేల్చేశారు. ఇదిలా ఉంటే వేణు స్వామి తాజాగా పబ్‌లో కనిపించి షాకిచ్చారు. ఆయన పబ్‌లో ఉండటం ఒక ఎత్తు అయితే..ఆయన కూర్చోన్న టేబుల్ మీద వైన్ గ్లాస్ ఉండటం మరో ఎత్తు. అయితే తనకు పబ్ ఉందనే విషయాన్ని వేణు స్వామినే స్వయంగా చెప్పారు. పైగా తనకు ఆల్కహాల్ అలవాటు కూడా ఉందని ఆయన తెలిపారు. ప్రస్తుతం వేణు స్వామి పబ్‌లో ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.












Click it and Unblock the Notifications