ఫ్యాన్స్ కు పూనకాలే.. పవన్ కల్యాణ్ తో సినిమాపై బండ్లన్న పోస్టు
ఇండస్ట్రీలో కొన్ని కాంబోలో ఎప్పటికీ ప్రత్యేకంగా ఉంటాయి. వాళ్ల కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు హిట్ అయినా ప్లాఫ్ అయినా సంబంధం లేకుండా ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తుంటారు. మళ్లీ మళ్లీ ఆ కాంబో రిపీట్ కావాలని కోరుకుంటూ ఉంటారు. ఇక టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ కు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంటే ఎంత అభిమానమో చెప్పనక్కర్ల లేదు. పవన్ కల్యాణ్ నా దేవుడు అని చెప్పుకుంటూ ఉంటారు బండ్ల గణేష్.
https://www.threads.com/@bandlaganesh_official/post/DOavXnXCctl?xmt=AQF0UTcNKMWotk0MdlxeoFFz_9XDyn05pto6QoJW5H3_8Qపవన్ కల్యాణ్ తో బండ్ల గణేష్ గతంలో తీన్ మార్ చిత్రం నిర్మించారు. ఆ తర్వాత గబ్బర్ సింగ్ మూవీ తీసిన సంగతి తెలిసిందే. అయితే తీన్ మార్ మూవీ ఫ్లాప్ కావడంతో.. పిలిచి మళ్లీ గబ్బర్ సింగ్ అవకాశాన్ని ఇచ్చారు పవన్. అది బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో బండ్ల గణేష్ కు తిరుగు లేకుండా పోయింది. ఇప్పటి వరకు మళ్లీ బండ్ల గణేష్ కు ఆ రేంజ్ హిట్ రాలేదు. పవన్ కళ్యాణ్ కు అది కమ్ బ్యాక్ ఫిల్మ్ గా మారిన విషయం తెలిసిందే.
అది తాజాగా బండ్ల గణేష్ సామాజిక మాధ్యమంలో పెట్టిన ఓ పోస్టు వైరల్ అవుతోంది. ' నా అంతరంగం మొత్తానికి ఒకటే తపన. త్వరగా బ్లాక్ బస్టర్ సినిమా తీయాలి. ఆ మహా క్షణాన్ని దగ్గర చేయమని భగవంతుణ్ని వేడుకుంటున్నాను' అని పోస్టు పెట్టారు. దానికి పవన్ కల్యాణ్ ఫోటోను యాడ్ చేశారు. దీంతో వీళ్ల కాంబో మరోసారి రిపీట్ కానుందని నెట్టింట టాక్ వినిపిస్తోంది. మళ్లీ గబ్బర్ సింగ్ సినిమా రేంజ్ బ్లాక్ బస్టర్ కొట్టాలని నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు.

మరోవైపు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఓజీ మూవీ ఈ నెల 25 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 19 లేదా 20 న నిర్వహించనున్నట్లు సమాచారం. డీవీవీ దానయ్య ఈ మూవీని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. అయితే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు బండ్ల గణేష్ రావాలంటూ మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. బండ్ల గణేష్ వస్తే ఫ్యాన్స్ లో నూతన ఉత్సాహం వస్తుందని చెబుతున్నారు. మరి ఫ్యాన్స్ రిక్వెస్ట్ కు బండ్లన్న ఓకే చెప్తారా లేదా చూడాలి.












Click it and Unblock the Notifications