Bigg Boss 9 : బిగ్ బాస్‌లో చివరిగా అడుగు పెట్టిందో ఎవరో తెలుసా..?

బిగ్ బాస్ 9 తెలుగు గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్, ఊహించని మలుపులు, అనూహ్య ఎంట్రీలతో ఒక సంచలనంగా మారింది. చివరి కంటెస్టెంట్ ఎంట్రీ తర్వాత కూడా, బిగ్ బాస్ హౌస్‌లోకి మరో కంటెస్టెంట్ అడుగుపెట్టారు.

బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ శ్రీముఖి వేదికపైకి వచ్చి నాగార్జునను ఒక కంటెస్టెంట్‌కు అనుమతి ఇవ్వమని కోరారు. అగ్ని పరీక్షలో తన ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్న మర్యాద మనీష్కు బిగ్ బాస్ హౌస్‌లోకి అవకాశం ఇవ్వాలని ఆమె విజ్ఞప్తి చేశారు. శ్రీముఖి అభ్యర్థనను గౌరవించిన నాగార్జున, మర్యాద మనీష్‌కు హౌస్‌లోకి అనుమతి ఇచ్చారు. దీంతో, ఈ సీజన్‌లో మొత్తం 15 మంది కంటెస్టెంట్స్ ఫైనల్ అయ్యారు.

Bigg Boss 9 Telugu Grand Launch Sree Mukhi s Request Gets Maryada Manish a Spot Finalizing the 15-Contestant List

ఈ సీజన్‌లో సామాన్యులు మరియు సెలబ్రిటీల మధ్య గట్టి పోటీ ఉండబోతోందని స్పష్టమవుతోంది. అగ్ని పరీక్ష ద్వారా ఎంపికైన సామాన్యులు - కళ్యాణ్, హరీష్, పవన్, శ్రీజ, ప్రియ హౌస్‌లో తమ స్థానాలను సుస్థిరం చేసుకోగా, చివరిగా మర్యాద మనీష్ కూడా చేరారు.

మరోవైపు, తనుజ, ఆశాశైనీ, భరణి, ఇమ్మాన్యుయేల్, సంజన గల్రాని, సుమన్ శెట్టి, రాము రాథోడ్, శ్రేష్టి వర్మ వంటి సెలబ్రిటీలు హౌస్‌లోకి వచ్చారు. ఇప్పుడు కంటెస్టెంట్స్ అందరూ హౌస్‌లోకి రావడం పూర్తయింది కాబట్టి, అసలైన బిగ్ బాస్ ఆట నేటి నుంచి మొదలైనట్లే. ఈ 15 మంది కంటెస్టెంట్స్‌లో ఎవరు చివరి వరకు ఉంటారో, ఎవరు బిగ్ బాస్ టైటిల్ గెలుస్తారో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+