Bigg Boss 10: బిగ్‌బాస్ ప్రేమికులకు గుడ్ న్యూస్.. లాంచ్ డేట్ ఫిక్స్.. లీకైన కంటెస్టెంట్ల లిస్ట్ ఇదే!
Bigg Boss 10: బుల్లితెరపై బిగ్‌బాస్ రియాలిటీ షోకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకం చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు బుల్లితెరపై తొమ్మిది సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో.. ఇప్పుడు పదో సీజన్‌కు రంగం సిద్ధమైంది. బిగ్‌బాస్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' ప్రారంభ తేదీని నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు. బిగ్ బాస్ పదో సీజన్ సెప్టెంబర్ 6వ తేదీ సాయంత్రం 7 గంటలకు అత్యంత వైభవంగా ప్రారంభం కానుంది. అయితే ఇప్పవరకూ ఓ లెక్క.. ఇప్పుడో లెక్క అన్నట్లు బిగ్‌బాస్ హౌస్‌ను 'దశావతారం' అనే వినూత్న కాన్సెప్టుతో డిజైన్ చేసి ఈ సారి అలరించేందుకు సిద్ధం చేశారు.
బిగ్‌బాస్ పదో సీజన్‌లో సెలబ్రిటీలతో పాటు సామాన్యులకు ఎక్కువ ప్రాధాన్య ఇవ్వనున్నట్లు తెలిసింది. స్టార్ మా, హాట్ స్టార్ లో ఈ సీజన్ ప్రసారం కానుంది. గత సీజన్ల లాగే ఈ పదో సీజన్ కు కూడా కింగ్ నాగార్జున హోస్ట్ పాత్రలో అలరించనున్నారు. అయితే ఈ సారి ఆటలో కాదు.. ఆటే సవాలు.. అంటూ వీడియోను పంచుకున్నారు. సర్ప్రైజ్‌లు, డ్రామా, సవాళ్లు అన్నీ 10 రెట్లు ఉంటాయని వెల్లడించారు.కొత్త కాన్సెప్ట్ ఊహించని ట్విస్టులతో రాబోతున్న ఈ సీజన్ ప్రేక్షకులను ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి.

ఈ సీజన్ ప్రారంభం గురించి ప్రకటన వెలువడటంతో కంటెస్టంట్లపై ఆసక్తి పెరిగింది. బిగ్‌బాస్ హౌస్ లోకి ఎవరెవరు అడుగుపెడతారనే చర్చ జోరుగా సాగుతోంది. గత సీజన్‌లో కామనర్స్‌కు బిగ్ బాస్ అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. 'అగ్నిపరీక్ష' ద్వారా ఎంపికైన కంటెస్టెంట్లు హౌస్‌లోకి వెళ్లారు. వారిలో కళ్యాణ్ పడాల విజేతగా నిలిచారు. దీంతో కామన్ ఆడియన్స్‌లో ఈ విధానానికి మంచి స్పందన వచ్చింది. ఇదే ఫార్ములాను ఈసారి కూడా కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. కామనర్స్ కోసం 'బిగ్ బాస్ అగ్నిపరీక్ష సీజన్ 2' నిర్వహిస్తున్నారు. ఇందులో 70 మందికి పైగా పోటీ పడ్డారు. చివరకు 15 మంది టాప్ కంటెస్టెంట్లుగా నిలిచారు. వారిలో అమన్ మసూద్, ఝాన్సీ, శ్రష్టి వ్యాకరణి, గాయత్రి, అపూర్వ, షాలినీ, చరణ్, రాజకుమారి, రామకృష్ణ, భాగీ తుళ్లూరి, రోహిత్ నాయుడు, ప్రియాంక, మిథిలేష్, హేమంత్ యాదవ్, దీపక్ సేనాపతి ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ 15 మందిలో ఆరుగురిని హౌస్‌లోకి పంపే అవకాశం ఉందని సమాచారం. అయితే తుది ఎంపికపై ఇంకా అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.
సెలబ్రిటీ కంటెస్టెంట్లపై ఉత్కంఠ
ఇక సెలబ్రిటీ కంటెస్టెంట్ల విషయంలో సోషల్ మీడియాలో ఎన్నో పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. వాటిలో కొన్ని పేర్లు మాత్రం ఎక్కువగా వినిపిస్తున్నాయి. దేబ్జానీ మోదక్, ముఖేష్ గౌడ, ఆటో రామ్ ప్రసాద్, జబర్దస్త్ నరేష్, ఎక్స్‌ప్రెస్ హరి , యాంకర్ వర్షిణి సౌందరాజన్, యాంకర్ సుధీర్ రెడ్డి, సినీ నటుడు కృష్ణుడు, టెంపర్ వంశీ, అదిత్ ఈశ్వరన్, చైత్ర రాయ్, సౌందర్య రెడ్డి, సుహాసిని పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సెలబ్రిటీ కంటెస్టంట్ల జాబితా అధికారికంగా వెలువడాల్సి ఉంది. అయితే ప్రస్తుతం మరో ఆసక్తికరమైన ప్రచారం కూడా జరుగుతోంది. ఈ సారి మొత్తం 15 మంది కంటెస్టెంట్లతో సీజన్ ప్రారంభం కావచ్చని సమాచారం. అందులో 9 మంది సెలబ్రిటీ, ఆరుగురు కామనర్స్ ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.













Click it and Unblock the Notifications