వీడియో: ఇంత గలీజ్‌గా బిహేవ్ చేస్తారా?: బిగ్ బాస్ కంటెస్టెంట్ అశ్విని శ్రీ కారు కూడా ధ్వంసం

బిగ్‍ బాస్ తెలుగు సీజన్‍ 7 విన్నర్ ఎవరో అఫీషియల్‌గా తేలింది. ఆదివారం రాత్రి జరిగిన గ్రాండ్ ఫినాలేలో విన్నర్ పేరు వెల్లడైంది. రైతు బిడ్డగా గుర్తింపు పొందిన పల్లవి ప్రశాంత్ ఈ సీజన్ విజేతగా నిలిచాడు. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7 టైటిల్ గెలుచుకున్నాడు.

అమర్‌దీప్ ఫస్ట్ రన్నరప్‌గా నిలిచాడు. శొంఠినేని శివాజీ, ప్రిన్స్ యావర్, ప్రియాంక జైన్, అంబటి అర్జున్.. ఆ తరువాతి స్థానాల్లో నిలిచారు. 35 లక్షల రూపాయలు అతనికి ప్రైజ్ మనీగా అందింది. విన్నర్‌కు 50 లక్షల రూపాయలను చెల్లించాల్సి ఉండగా.. అందులో 15 లక్షలను ప్రిన్స్ యావర్ తీసుకుని టైటిల్ రేసు నుంచి తప్పుకొన్న విషయం తెలిసిందే.

Bigg Boss Telugu season 7 contestant Ashwini Sris car also damaged by the fans

గ్రాండ్ ఫైనల్ ముగిసిన తరువాత కలకలం చోటు చేసుకుంది. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చిన అమర్‌దీప్‌ కారును పల్లవి ప్రశాంత్ అభిమానులు చుట్టుముట్టారు. కారు అద్దాలు పగలగొట్టారు. కారు దిగి రావాలంటూ తీవ్ర భయాందోళనలకు గురి చేశారు. కారు ముందుకు వెళ్లకుండా అడ్డుపడ్డారు. ఆ సమయంలో అమర్‌‌దీప్, ఆయన తల్లి, భార్య కారులోనే ఉన్నారు.

ఈ ఘటనతో అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు అన్నపూర్ణా స్టూడియోస్‌కు చేరుకున్నారు. పల్లవి ప్రశాంత్, అమర్‌దీప్ అభిమానులను చెదరగొట్టారు.

అదే సమయంలో మరో కంటెస్టెంట్ అశ్విని శ్రీ కారును సైతం ధ్వంసం చేశారు. ఆమె కారు అద్దాలు పగిలిపోయాయి. కారు బ్యాక్‌సైడ్ విండ్ గార్డ్ మొత్తం ధ్వంసమైంది. ముందు భాగంలో విండ్ షీల్డ్‌పై అద్దాలు పగిలిపోయాయి. ఈ ఘటనపై అశ్వినీ శ్రీ ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను ఆమె పోస్ట్ చేశారు.

ఇప్పుడే బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలె ముగించుకుని బయటికి వచ్చామని, తన అపార్ట్‌మెంట్ బేస్‌మెంట్‌లో పార్క్ చేసి ఉంచిన కారును ధ్వంసం చేశారని చెప్పారు. ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా.. ఇలాంటి దాడులు సరికాదని అన్నారు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. తాము కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ కోసమే రోజూ కష్టపడతామని, ఇంత గలీజ్‌గా హర్ట్ చేస్తారా? అంటూ బాధపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+