రచ్చ రచ్చే.. బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లబోయే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ వీళ్లే..!

తెలుగు బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన రియాల్టీ షో 'బిగ్‌బాస్'. అటు కామనర్స్.. ఇటు సెలబ్రిటీలతో కలిసి సాగుతున్న ఈ 9వ సీజన్ ఆశించిన స్థాయిలో అలరించలేకపోతుంది. ఉన్న కంటెస్టెంట్లలో ఇమ్మానుయేల్ వన్ మ్యాన్ షో తో అదరగొడుతుంటే.. మిగిలిన వారు సో సో గా గడిపేస్తున్నారు. పవన్, కళ్యాణ్ ఒకటే పనిలో ఉన్నట్టు జంటగా మారాలని చూస్తుంటే.. భరణి ఇంటి పెద్దగా మారి ఇతరుల విషయాల్లో ఎక్కువక కేర్ తీసుకుంటున్నట్టు కనిపిస్తుంది. ఇక సంజన చిత్రవిచిత్రమైన ప్రవర్తనతో విసుగు తెప్పిస్తుంటే.. సుమన్ శెట్టి, శ్రీజ, దివ్య, ఫ్లోరా షైనీ వారి పనుల్లో వారు ఉంటున్నారు.

ఈ పరిస్థితుల్లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లు వస్తేనే ఆట రసవత్తరంగా మారుతుందని భావిస్తున్నారు. అందులో భాగంగానే వచ్చే ఆదివారం నాడు ఆరుగురు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లు హౌస్‌లోకి ప్రవేశించనున్నారని టాక్ వినిపిస్తుంది. వీరంతా శనివారం నాడే హౌస్‌లోకి వెళ్తున్నప్పటికీ.. ఆ ఎపిసోడ్‌ను '2.0' పేరుతో ఆదివారం గ్రాండ్ లాంచ్‌గా ప్రసారం చేయనున్నారని సమాచారం. ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో సీజన్ 9కి మళ్లీ కొత్త వస్తుందని.. అసలైన రణరంగం మొదలవుతుందని అనుకుంటున్నారు.

bigg-boss-telugu-season-9-six-wild-card-contestants-list

వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చేది వీళ్లే..

రమ్య మోక్ష ( అలేఖ్య చిట్టి పికెల్స్ )..

బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్‌గా ఈ ముద్దుగుమ్మ పేరు బాగా వినిపిస్తుంది. అయితే వైల్డ్ కార్డ్‌గా పంపించడం కోసమే ఆపినట్లు తెలుస్తోంది. హీరోయిన్ లకు ఏ మాత్రం తీసుపోని విధంగా ఉండే ఈమె.. అటు వివాదాలకు కూడా కేరాఫ్ అడ్రస్ అని చెప్పొచ్చు. అందుకే ఈ భామ ఎంట్రీపై బాగా అంచనాలు ఉన్నాయి.

bigg-boss-telugu-season-9-six-wild-card-contestants-list

దివ్వెల మాధురి..

సీజన్ ప్రారంభం నుంచి మాధురి పేరు వినిపిస్తుంది. కానీ బిగ్ బాస్ ఆఫర్‌ను తిరస్కరించానని గతంలో పేర్కొంది. అందుకే బిగ్ బాస్ టీం వైల్డ్ కార్డ్‌గా ఆమెను పంపించడానికి గట్టిగానే ప్రయత్నాలు చేస్తుందని.. అయితే చివరి నిమిషం వరకు వస్తుందో రాదో అనే విషయం మాత్రం సస్పెన్స్ అని గుసగుసలు వినిపిస్తున్నాయి.

bigg-boss-telugu-season-9-six-wild-card-contestants-list

అయేషా జీనత్..

వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లలో అయేషా కూడా ఉంటుందని సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తోంది. 'సావిత్రమ్మ గారి అబ్బాయి' సీరియల్‌తో పాపులర్ అయిన ఈమె.. తమిళ బిగ్ బాస్ సీజన్ 6లో దాదాపు 9 వారాలు ఉంది. ఫైరింగ్ కంటెస్టెంట్ గా నిలిచి.. కమల్ హాసన్ మీదకే ఎదురు తిరిగి హాట్ టాపిక్ అయింది. గ్లామర్ బ్యూటీ కూడా కావడంతో.. బిగ్ బాస్‌కి కావాల్సినంత కంటెంట్ అందిస్తుందని ప్రచారం జరుగుతోంది.

bigg-boss-telugu-season-9-six-wild-card-contestants-list

శ్రీనివాస సాయి..

గోల్కొండ హైస్కూల్, శుభలేఖలు, వినరా సోదర వీరకుమారా వంటి సినిమాల్లో నటించి ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ కుర్రాడు బిగ్ బాస్ ద్వారా తిరిగి వెలుగులోకి వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు చెబుతున్నారు.

నిఖిల్ నాయర్..

గృహలక్ష్మి, పలుకే బంగారమాయెనా సీరియల్స్ తో తెలుగు ఆడియన్స్ లో నిఖిల్ నాయర్ మంచి గుర్తింపు పొందారు. బిగ్ బస్ లోకి ఎంట్రీ ఇస్తే ఫిజికల్ టాస్క్‌లలో బలమైన పోటీ ఇవ్వగలడని అంచనా వేస్తున్నారు.

bigg-boss-telugu-season-9-six-wild-card-contestants-list

గౌరభ్ గుప్త..

ఈ నటుడు ప్రస్తుతం గీత LLB సీరియల్‌లో నటిస్తున్నాడు. ఇతను కూడా ఎంట్రీ ఇవ్వనున్నట్టు సోషల్ మీడియా కోడై కూస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+