జనసేనలోకి రాజాసింగ్..? అంతా ఓకే, అక్కడే అసలు ట్విస్ట్..!!

హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణ రాజకీయాలు ఆసక్తి కరంగా మారాయి. కొత్త సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. త్వరలో జరగనున్న గ్రేటర్ ఎన్నికల కోసం ప్రధాన పార్టీలు కొత్త వ్యూహాలను సిద్దం చేస్తున్నాయి. జనసేన సైతం గ్రేటర్ లో పోటీకి డిసైడ్ అయింది. బీజేపీ తమకు పొత్తు ఎవరి తో ఉండదని.. సింగిల్ గానే పోటీ చేస్తామని ప్రకటించింది. ఇదే సమయంలో ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఆయన అడుగులు ఏంటనేది స్పష్టత వస్తోంది. ఇక్కడే అసలు లెక్కలు మొదలయ్యాయి.

హైదరాబాద్ కేంద్రంగా రాజకీయం వేడెక్కుతోంది. సీఎం రేవంత్ గ్రేటర్ ఎన్నికలే లక్ష్యంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. పథకాల అమలు పైన ఫోకస్ చేసారు. కొత్త నిర్ణయాల అమలు దిశ గా కార్యాచరణ ఖరారు చేస్తున్నారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ గ్రేటర్ పరిధిలో తమ బలం మరో సారి చాటాలని భావిస్తోంది. బీజేపీ సైతం హైదరాబాద్ లో తమకు తిరుగు లేదని చెబుతోంది.

 ఢిల్లీ నుంచి బీజేపీ డిక్లేర్ - ఇక తేల్చుకోవాల్సింది పవన్..!!
ఢిల్లీ నుంచి బీజేపీ డిక్లేర్ - ఇక తేల్చుకోవాల్సింది పవన్..!!
Raja Singh Latest Comments on Janasena Hint at Big Political Developments in Telangana

ఈ సమయంలోనే జనసేనాని పవన్ తాము వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. ఇటు బీజేపీ మాత్రం తమకు జనసేనతో పొత్తు ఉండదని తేల్చి చెప్పింది. జనసేన కేడర్ గ్రేటర్ ఎన్నికల కోసం కసరత్తు మొదలు పెట్టింది. కాగా, ఎమ్మెల్యే రాజాసింగ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. జనసేన రాబోయే మున్సిపల్, అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలోని అన్ని స్థానాల్లో పోటీ చేయాలని సూచించారు.

దీనికి కొనసాగింపుగా పవన్ కల్యాణ్ నాయకత్వంలో తెలంగాణలోనూ జనసేన బలపడితే భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కూడా ఉంటుందని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త లెక్కలకు కారణమవుతున్నాయి. తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనపై ప్రజలు విసిగి పోయారని, ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో జనసేనకు, ముఖ్యంగా యువతలో మంచి ఆదరణ ఉందని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో పవన్ పార్టీని రాష్ట్రంలో విస్తరించాలని కోరారు. రాష్ట్ర బీజేపీలో నిర్ణయాల పైన రాజాసింగ్ ఓపెన్ గానే తన అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.

అలిగిన పవన్?-ఫలించని నారాయణ రాయబారం.! అమరావతి వదిలి విశాఖకు..!
అలిగిన పవన్?-ఫలించని నారాయణ రాయబారం.! అమరావతి వదిలి విశాఖకు..!

కాగా.. జనసేన లో తనకు కీలక బాధ్యతలు అప్పగిస్తే అందులో తన వంతు పాత్ర పోషించేందుకు రాజాసింగ్ సిద్దంగా ఉన్నాననే సంకేతాలు ఇస్తున్నట్లుగా విశ్లేషణ లు మొదలయ్యాయి. అయితే, బీజేపీతో ఏపీలో పొత్తులో కొనసాగుతున్న పవన్.. ఇప్పుడు రాజాసింగ్ ను పార్టీలో చేర్చుకునేందుకు అంగీకరిస్తారా అనేది సందేహంగానే కనిపిస్తోంది. దీంతో.. గ్రేటర్ ఎన్నికల్లో జనసేన పోటీ.. రాజాసింగ్ నిర్ణయం ఇప్పుడు రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+