గొప్ప మనసు చాటుకున్న బాలీవుడ్ నటి సన్నీలియోన్...
బాలీవుడ్ నటి సన్నీలియోన్ గొప్ప మనసు చాటుకున్నారు. తన పనిమనిషి కూతురు తప్పిపోవడంతో ఆందోళన వ్యక్తం చేసిన సన్నీలియోన్, ఆచూకీ కోసం తనవంతుగా కృషి చేశారు. రెండురోజుల క్రితం సన్నీలియోన్ సోషల్‌మీడియాలో తన ఖాతాలో తన పనిమనిషి కూతురు తప్పిపోయిందని పోస్ట్ చేశారు. ఆ చిన్నారిని క్షేమంగా అప్పగించినవారికి 50వేల రూపాయలు ఇస్తానని ప్రకటించింది. అంతటితో ఆగకుండా ఈ విషయంపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా పలు స్థానిక సంఘాలకు కూడా ఈ విషయాన్ని చెప్పింది.
50 వేల రూపాయలు ఇస్తానని ప్రకటించింది : ఆ చిన్నారి పేరు అనుష్క కిరణ్ మోర్. తనకు తొమ్మిదేళ్లు ఉంటాయి. నవంబర్ 8వ తేది సాయంత్రం ఏడు గంటల సమయంలో ముంబయిలోని జోగేశ్వరి ప్రాంతంలో ఆ చిన్నారి తప్పిపోయింది. అయితే, ఎవరైనా బాలిక ఆచూకి తెలిపితే వారికి 11 వేల రూపాయలు ఇస్తామని బాలిక తల్లిదండ్రులు సోషల్‌మీడియా వేదికగా ప్రకటించారు. అయితే, ఆ చిన్నారి ఆచూకి తెలిపిన వారికి తాను వ్యక్తిగతంగా 50 వేల రూపాయలు ఇస్తానని సన్నీలియోన్ ప్రకటించారు.

24 గంటల్లో ఇంటికి తిరిగొచ్చిన బాలిక : ఇదే క్రమంలో తాజాగా మరోపోస్ట్ పెట్టింది సన్నీలియోన్. తప్పిపోయిన చిన్నారి దొరికిందని, సురక్షితంగా తమ కుటుంబం వద్దకు చేరుకుందని పేర్కొంది. 24 గంటల్లో బాలిక ఇంటికి తిరిగి వచ్చిందని, ఇందుకు సహకరించిన ప్రతిఒక్కరికి మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాని పోస్ట్ చేసింది. దీంతో సన్నీలియోన్ మంచి మనసుకు నెటిజన్లు ఫిదా అయిపోయి, ఆమెను అభినందిస్తున్నారు.
జీ తెలుగులో ప్రసారవుతున్న షోలో : బాలీవుడ్‌లో ఎన్నో సినిమాల్లో నటించారు సన్నీలియోన్. తెలుగులో కూడా ఆమె ఒక రెండు మూడు చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు తెలుగు షోలలో అడుగుపెట్టారు. జీ తెలుగులో ప్రసారమయ్యే 'తెలుగు మీడియం ఇస్కూల్' గేమ్ షోకు జడ్జీగా వ్యవహరిస్తూ అందరిని అలరిస్తోంది.












Click it and Unblock the Notifications