ఇన్‌స్టాలో పెళ్లినాటి ఫోటోను షేర్ చేసిన బాలీవుడ్ నటి..
బాలీవుడ్ నటి సన్నీలియోన్ తాజాగా తన పెళ్లి ఫోటోను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో కాస్త నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో స్పెషల్ సాంగ్స్‌తో ఈ నటి స్పెషల్ క్రేజ్ సొంతం చేసుకుంది. ఒక్క హిందీలోనే కాకుండా వివిధ భాషల్లోనూ తను నటించి అందరినీ మెప్పించింది. హిందీ, తెలుగు, కన్నడ, మలయాళం, తమిళం, బెంగాళీ భాషలలో అనేక చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేసి ప్రేక్షకులను అలరించింది ఈ బ్యూటీ. సౌత్‌లో కూడా ఈ అమ్మడు సినిమాలు చేసింది. మంచు మనోజ్ నటించిన కరెంట్ తీగ సినిమాలో కీలకపాత్రలో మెరిసింది సన్నీలియోన్. ఈ బ్యూటీ తెలుగులో నటించిన చివరి సినిమా జిన్నా. ప్రస్తుతం ఈ అమ్మడు చేతినిండా ప్రాజెక్టులతో ఫుల్ బిజిగా ఉంది.
సినిమాలు, స్పెషల్ సాంగ్స్‌లో నటించడమే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ, హోస్ట్‌గానూ ఈ బ్యూటీ అందరీని అలరిస్తోంది. హిందీ బుల్లితెరలో కనిపించడంతో పాటు తెలుగు బుల్లితెరపై కూడా ఈ బ్యూటీ మెరిసింది. ప్రస్తుతం స్ల్పిట్ విల్లా ఐదో సీజన్ హోస్ట్ గా వ్యవహరిస్తుంది సన్నీలీయోన్. ప్రస్తుతం ఈ నటి బాలీవుడ్ సింగర్ హిమేష్ రేష్మియా ప్రధాన పాత్రలో నటిస్తోంది.
తాజాగా ఈ అమ్మడు సోషల్‌మీడియాలో తన పెళ్లి నాటి ఫోటోను షేర్ చేసింది. సన్నీలియోన్ పెళ్లి అయ్యి 13 ఏళ్లు గడిచిన క్రమంలో అప్పటి ఫోటోను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. అంతేకాదు, ఆ ఫోటోకి క్యాప్షన్ కూడా ఇచ్చింది. దేవుడి ముందు ఒట్టు వేశాము, మంచి సమయాల్లోనే కాదు, కష్ట సమయాల్లోనూ కలిసి ఉండాలని..అంటూ ఆ ఫోటోకు క్యాప్షన్ పెట్టింది సన్నీలియోన్.

2011లో వీరిద్దరి పెళ్లి...
ఈ సందర్భంగా భర్త డానియల్ వెబర్‌కు శుభాకాంక్షలు తెలిపింది. వెబర్ కూడా తన ఇన్‌స్టా ఖాతాలో పెళ్లి వీడియోను పోస్టు చేశారు. ఈ జంట 2011లో వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ 2017లో నిషా అనే అమ్మాయిని దత్తత తీసుకున్నారు. 2018లో వీరు సరోగసి ద్వారా ఇద్దరు అబ్బాయిలకు జన్మనిచ్చారు. వారి పేర్లు నోహ, అషర్‌లు. నటి సన్నీలియోన్ తన సినీ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకున్నారు.












Click it and Unblock the Notifications