దివ్వెల మాధురిపై బాలీవుడ్ స్టార్ బ్యూటీ జాన్వీ కపూర్ ఫైర్..

తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ జంట ఎంత ఫేమస్ అయ్యారో అదే రేంజ్ లో ట్రోల్ కూడా అయ్యారు. ఆ ఫాలోయింగ్ తోనే బిగ్ బాస్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది మాధురి. కాగా రీసెంట్ గానే దివ్వెల మాధురి, బిగ్ బాస్ సీజన్ 9 రన్నరప్ తనూజలు ఒక వివాదంలో చిక్కుకున్నారు. శ్రీవారి సన్నిధిలో తనూజ పుట్టస్వామి వేడుకలను నిర్వహించుకున్నారు. ఈ వేడుకలకు సంబంధించిన వీడియోను దివ్వెల మాదిరి తన ఇన్ స్టాగ్రామ్ లో పంచుకోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. తిరుమల శ్రీవారి కొండ చాలా పవిత్రమైన ప్రదేశంగా భావిస్తారు. కొండలపైన కేక్ తీసుకు వెళ్లడం నిషేధం. దాంతో తిరుమల పవిత్రతకు భంగం కలిగించారన్న ఆరోపణలతో వీరిపైన తిరుమల తిరుపతి దేవస్థానం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో ఆమెపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది. ఈ వివాదంపై స్పందించిన మాధురి తనదైన శైలిలో స్పందించింది. ఎగ్ లెస్ కేక్ తీసుకెళ్లామని తాము తిరుమల పవిత్రతను భంగపరచలేదని వ్యాఖ్యానించింది. అంతే కాకుండా తిరుమల కొండపై గతంలో నటి జాన్వీ కపూర్ కూడా కేక్ కట్ చేశారు. అప్పుడు ఎవరూ స్పందించలేదు, కానీ నేను చేస్తే మాత్రం ఇంత సంచలనం చేస్తున్నారెందుకు? అంటూ ప్రశ్నించారు. అయితే ఇప్పుడు మాధురి చేసిన వ్యాఖ్యలకు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ కౌంటర్ ఇచ్చింది. దీంతో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.

bollywood-star-beauty-janhvi-kapoor-fires-at-divvela-madhuri-over-tirumala-tirupathi-issue

జాన్వీ కపూర్ ఫైర్..

మాధురి ఇంటర్వ్యూ వీడియోను షేర్ చేస్తూ.. అసలు ఎవరు ఈ మహిళ ? అంటూ ప్రశ్నించారు. తాను చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి.. తనపై వచ్చిన వివాదాన్ని మళ్లించడానికి తనపై అబద్ధపు ఆరోపణలు చేస్తోందని రాసుకొచ్చారు. తిరుమల వేంకటేశ్వరస్వామితో పెట్టుకోవద్దని.. దేవుడితో పెట్టుకుంటే ఏం జరుగుతుందో అందరికీ తెలుసని హితబోధ చేశారు. కాగా జాన్వీ కపూర్ తిరుమల వేంకటేశ్వరస్వామికి భక్తురాలు అని అందరికీ తెలిసిందే. సినిమా షూటింగ్ లలో బిజీగా ఉంటున్నప్పటికీ తరచుగా స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. అయితే ఆ అకౌంట్ నిజంగా జాన్వీ కపూర్ ది కాదని.. ఆమె ఫ్యాన్ పేజ్ అని తెలుస్తోంది.

మరోవైపు జాన్వీ ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - బుచ్చిబాబు సనా కాంబినేషన్‌లో రూపొందుతున్న 'పెద్ది' సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రంలో జగపతిబాబు, కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్, బాలీవుడ్ నటుడు దివ్యేండు సహా పలువురు నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత మ్యూజిక్ డైరెక్టర్​ ఏఆర్‌ రెహమాన్‌ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్‌ రైటింగ్స్‌ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది మార్చి 27న విడుదల కాబోతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+