ఉన్నపళంగా ఆసుపత్రికి చేరుకున్న చిరంజీవి ఫ్యామిలీ, అల్లు అర్జున్ ఫ్యామిలీ

తెలుగులో అగ్ర కథానాయకుడిగా చెలామణి అవుతున్న మెగాస్టార్ చిరంజీవికి అల్లు రామలింగయ్య స్వయంగా పిల్లనిచ్చిన మామ అవుతారు. తన కూతురు సురేఖను చిరంజీవికి ఇచ్చి వివాహం చేయడంతోపాటు అతను మెగాస్టార్ గా రాణించడానికి ఎంతో దోహదపడ్డారు. ప్రస్తుతం అల్లు రామలింగయ్య మృతిచెందారు. ఆయన చేసిన సహాయానికి గుర్తుగా ఇంట్లో దేవుడి పటాలతోపాటు అల్లు రామలింగయ్య పటం కూడా ఉంచుకొని చిరంజీవి ప్రతిరోజు పూజ చేస్తుంటారు. ప్రస్తుతం చిరంజీవి కుటుంబానికి, అల్లు అరవింద్ కుటుంబానికి మధ్య కోల్డ్ వార్ నడుస్తోందంటూ కొన్నాళ్లుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

చిరంజీవికి స్వయంగా అత్త
అల్లు రామలింగయ్య భార్య, చిరంజీవికి స్వయంగా అత్త అయిన కనకరత్నం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులంతా వెంటనే ఆమెను ప్రయివేటు ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. అల్లు అరవింద్, ఆయన సతీమణి, అల్లు అర్జున్, ఆయన సతీమణి, ఇతర కుటుంబ సభ్యులంతా ఆసుపత్రికి చేరుకున్నారు. ఆమె వయసు 95 సంవత్సరాలు కావడంతో వృద్ధాప్యంలో వచ్చే సమస్యల వల్ల అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలియడంతో చిరంజీవి తన కుటుంబ సభ్యులతో కలిసి ఆసుపత్రికి చేరుకోనున్నారు. అల్లు అర్జున్ అరెస్ట్ అయిన విడుదలైన తర్వాత కూడా బన్నీ స్వయంగా వెళ్లి చిరంజీవిని, నాగబాబును కలిసిన సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ ను కూడా కలవడానికి ప్రయత్నించినప్పటికీ కుదర్లేదు.

Chiranjeevi and Allu Arjun s family immediately rushed to the hospital

యథావిధిగానే కొనసాగుతున్న సంబంధాలు
అప్పుడు కొంచెం ఈ రెండు కుటుంబాల మధ్య సంబంధాలు బలపడ్డాయనుకున్నారుకానీ యథావిధిగానే కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ కు, రామ్ చరణ్ కు మధ్య విభేదాలు రావడమే దీనికి కారణమని తెలుస్తోంది. విభేదాలకు కారణం వీరిద్దరికే తెలియాలి. వారి కుటుంబ సభ్యులకు తెలియాలి. మరెవరికీ తెలియడంలేదు. ఎందుకు గొడవలొచ్చాయి? వీరిద్దరిలో తప్పు ఎవరిది అనే విషయం కూడా తెలియదు. ఏదేశమైనప్పటికీ ఈ రెండు కుటుంబాలకు చెందినవారంతా అన్యోన్యంగా ఉండాలని మెగా అభిమానులు, అల్లు అర్జున్ అభిమానులు కోరుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+