Chiranjeevi సెంటిమెంట్: నిద్రలేవగానే ఆమె ముఖమే చూస్తారట!!
చిరంజీవి. తెలుగు వారి అభిమాన హీరో మాత్రమే కాదు, దేశ విదేశాలలోనూ ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. చిరంజీవి స్వయంకృషితో ఎదిగిన హీరో. సుప్రీం హీరోగా, ఇప్పుడు మెగా స్టార్ గా చిరంజీవి తనకంటూ తెలుగు సినీ చరిత్రలో గొప్ప స్థానాన్ని సంపాదించారు. చిరంజీవి సినీప్రస్థానం, ఆయన జీవితప్రస్థానం రెండు స్ఫూర్తిదాయకాలే. ఇటీవల చిరంజీవిని కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఆయన చేసిన సేవలకు పద్మవిభూషణ్ తో గౌరవించింది.
చిరంజీవికి కొన్ని సెంటిమెంట్ లు
ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం, నిరాడంబరంగా ఉండడం, ప్రతి ఒక్కరిని కలుపుకొని పోవడం, అవసరమైన వారికి సేవ చేయడం, సరదాగా ఉండడం.. చిరంజీవి లో ఉండే గొప్ప లక్షణాలు. ఇక అటువంటి చిరంజీవికి చాలా సెంటిమెంట్లు ఉంటాయి అంటే కచ్చితంగా నమ్మి తీరాల్సిందే. చిరంజీవి ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే ప్రతిరోజు ఒకరి ముఖం తప్పనిసరిగా చూస్తారు. ఆమె ముఖం చూసిన తర్వాతనే చిరంజీవి తన దైనందిన కార్యక్రమాల్లోకి వెళ్తారు.

ఒక మహానటి ఫోటో చూశాకే చిరంజీవి రోజు ప్రారంభం
సహజంగా ఉదయం నిద్ర లేచిన వెంటనే దేవుడి చిత్రం, తల్లిదండ్రుల ముఖాన్ని, లేదా మనకు బాగా ఇష్టమైన వారి ముఖం చూస్తూ ఉంటాం. ఇక చిరంజీవి తన భార్య సురేఖ ముఖాన్ని, లేదా తన తల్లి అంజలీదేవి ముఖాన్ని చూస్తారేమో అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ చిరంజీవి ప్రతిరోజు నిద్రలేచిన వెంటనే ముందుగా ఒక గొప్ప మహానటి చిత్రాన్ని చూసిన తర్వాతనే తన పనులను ప్రారంభిస్తారు.
చిరంజీవి సెంటిమెంట్ చెప్పిన చాముండేశ్వరి
ఇంతకు చిరంజీవి మనసులో అంత గొప్ప స్థానం సంపాదించుకున్న మహానటి ఎవరు? ఎవరి ముఖం చూసిన తర్వాత చిరంజీవి తన పనులను ప్రారంభిస్తారు అన్న విషయాన్ని తాజాగా విజయ చాముండేశ్వరి వెల్లడించారు. విజయ చాముండేశ్వరి మహానటి సావిత్రి కూతురు. తాజాగా సావిత్రి పై ఆమె రాసిన సావిత్రి క్లాసిక్స్ పుస్తకాన్ని మెగాస్టార్ చిరంజీవి దంపతులు నిన్న రాత్రి ఆవిష్కరించారు.
Savitri gari Daughter Vijaya Chamundeswari garu about #Chiranjeevi garu,He Admires Savitri garu a lot , fews days back @KChiruTweets had a leg surgery ,He unable to walk,when I went to his home ,His recieving was very respectful and Affection ,that is #MegastarChiranjeevi pic.twitter.com/25FGZJgjl5
— Chiranjeevi Army (@chiranjeeviarmy) April 2, 2024
ఆమె అంటే చిరంజీవికి చాలా ఇష్టం
ఈ సందర్భంగా మాట్లాడిన చాముండేశ్వరి చిరంజీవికి సావిత్రి అంటే ఎంతో ఇష్టమని, ఆయనకు సావిత్రి అంటే ఎంత ఇష్టమంటే.. ప్రతిరోజు ఉదయం నిద్ర లేచిన వెంటనే మహానటి సావిత్రి గారి ఫోటోను ఆయన చూస్తారు అంటూ చాముండేశ్వరి పేర్కొన్నారు. నిద్రలేవగానే ఆమె ఫోటో చూడడం చిరంజీవి గారికి ఎప్పటినుంచో ఉన్న అలవాటని, సావిత్రి గారి ఫోటోను చూసిన తర్వాతనే ఆయన తన దైనందిన కార్యక్రమాలను మొదలు పెడతారని తెలిపారు.
నిజంగా గొప్ప విషయం చెప్పిన సావిత్రి తనయ
ఇది నిజంగా చాలా గొప్ప విషయం. నటననే ప్రాణంగా భావించే చిరంజీవి, మహానటి సావిత్రి ఫోటో చూసిన తర్వాతనే తన రోజువారి కార్యక్రమాలను నిర్వహించటం నిజంగా విశేషం. మహానటి సావిత్రి పట్ల ఆయనకున్న గౌరవం , భక్తిని ఇది స్పష్టం చేస్తుంది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు!












Click it and Unblock the Notifications