మెగా ఫ్యామిలీ ఎక్కడ విడిపోతుందో అని ఆ పని చేసిన చిరంజీవి..?

తెలుగు ఇండస్ట్రీ గురించి మాట్లాడుకోవాలంటే ముందుగా మెగా ఫ్యామిలీ గురించి చర్చించుకోవాలి. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన చిరంజీవి, అంచెలంచెలుగా ఎదుగుతూ స్టార్ హీరోగా మారారు. ఇండస్ట్రీకి చెందిన హీరోల కొడుకులు వారసులుగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ వారిని దాటుకుని మరీ నెంబర్ వన్ స్థానాన్ని చిరంజీవి కైవసం చేసుకున్నారు. దాదాపు 30 ఏళ్లపాటు తెలుగులో టాప్ హీరోగా చిరంజీవి నిలిచారంటే ఆయన స్టామినా ఏంటో అర్థం చేసుకోవచ్చు.

ఒకనొక సమయంలో దేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న హీరోగా చిరంజీవి నిలిచారు. చిరంజీవి తర్వాత ఆయన ఫ్యామిలీ నుంచి అరడజనుకుపైగా హీరోలు ఇండస్ట్రీకి పరిచియం అయ్యారు.మెగా బ్రదర్ నాగబాబు , పవన్ కల్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు శిరీష్, హీరోయిన్‌గా నిహారిక వంటివారు మెగా ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇచ్చారు. అయితే మెగా ఫ్యామిలీలో ఇటీవల కొన్ని విభేదాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి మద్దతుగా నిలిచారు.

Chiranjeevi s key decision to keep the mega family from breaking up

మెగా ఫ్యామిలీ అంతా కూడా పవన్ కల్యాణ్‌కు అండగా నిలిస్తే..ఒక్క అల్లు అర్జున్ మాత్రం వైసీపీ అభ్యర్థికి తన మద్దతు ప్రకటించారు. దీనిపై మెగా బ్రదర్ నాగబాబు అల్లు అర్జున్‌పై ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. దీంతో రెండు ఫ్యామిలీల్లో విభేదాలు చోటు చేసుకున్నాయి.ఫ్యామిలీలో చోటు చేసుకున్న ఘర్షణలపై మెగాస్టార్ సంచలన నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. మెగా ఫ్యామిలీ ఎక్కడ విడిపోతుందనే ఉద్దేశంతో చిరంజీవి ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఎవరూ ఎంత బిజీగా ఉన్నా నెలలో తప్పకుండా రెండు సార్లు అంతా కలిసి జాయ్ ఫుల్‌గా గడపాలని రూల్ పెట్టారట.

ఏమైనా గొడవలైన అందరూ ఒకే చోట మీట్ అయ్యాక తప్పకుండా మాట్లాడుకోవాలని చెప్పారట. ఇలా కలిసి చోట ఒకరికొకరు సుఖదుఃఖాలను పంచుకుంటూ ఉంటారట. చిన్న చిన్న గొడవలు ఉన్నా మర్చిపోయి సంతోషంగా గడుపుతారట. అయితే మెగా ఫ్యామిలీ మీటింగ్ జరిగి చాలాకాలం అయిందంట. దీంతో మరోసారి ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసేలా చిరంజీవి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. తద్వారా మెగా ఫ్యామిలీలో చోటు చేసుకున్న విభేదాలకు చెక్ పెట్టవచ్చని చిరంజీవి ఆలోచనగా తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు చిరంజీవిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+